హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామ నాటి వైరం: చంద్రబాబుపై దగ్గుబాటి ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, కాంగ్రెసు శానససభ్యుడు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుకి మధ్య వైరం ఈనాటిది కాదు. ఎన్టీఆర్ కుటుంబంలోని ఈ ఇద్దరు తోడల్లుళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా బహిరంగ యుద్ధంగా మారింది. ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం కోసం ఈ ఇరువురి మధ్య పోరాటం నిరంతరం సాగుతుండేది.

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత అటూ ఇటూ తిరిగి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు గూటికి చేరుకున్నారు. ఈలోగా ఆయన సతీమణి పురంధేశ్వరి రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్రంలో మంత్రి పదవిని అధిష్టించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రప స్థాపనపై చంద్రబాబుతో కయ్యానికి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కయ్యానికి కాలు దువ్వారు. చాలా కాలంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎక్కువగా మాట్లాడడం లేదు. శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ పెద్దగా బహిరంగ వేదికల మీదికి రావడం లేదు. కాంగ్రెసు పార్టీ అంతర్గత రాజకీయాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో ఇద్దరు అల్లుళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ ఉండేది. దీంతో పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతూ ఉండేవి. పరస్పరం పైచేయి కోసం ఈ రెండు వర్గాలు నిరంతరం పోరాడుతూ ఉండేవి.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచీ నెంబర్ టూ స్థానం అత్యంత ప్రమాదకరమైంది. పర్వతనేని ఉపేంద్ర పార్టీ నుంచి వెళ్లి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు రెండో స్థానాన్ని అక్రమించారు. ఎన్టీ రామారావు తర్వాత ఆ స్థానం చంద్రబాబు నాయుడిదిగానే ఉండేది. ఈ పోటీలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వెనకపడ్డారు.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మార్పు వచ్చింది. చంద్రబాబు స్థానం కదిలింది. దాంతో పార్టీలో తిరుగుబాటుకు బీజం పడింది. చంద్రబాబు నాయుడు చాణక్యనీతిని ప్రదర్శించి, దగ్గుబాటి వెంకటేశ్వర రావును, నందమూరి హరికృష్ణను తన వైపు తిప్పుకున్నారు. ఎన్టీ రామారావును అధికారం నుంచి దింపేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్లడంతో ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. చంద్రబాబుతో పడకపోవడంతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు లక్ష్మీపార్వతివైపు వచ్చారు. కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయారు.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

బావమరిది నందమూరి హరికృష్ణతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అది క్లిక్ కాలేదు. దాంతో నందమూరి హరికృష్ణ తిరిగి బావ చంద్రబాబు చెంతకు రాగా, దగ్గుబాటి వెంకటేశ్వర రావు బిజెపిలో చేరారు. ఆక్కడ కూడా ఉండలేకపోయారు. ఆ తర్వాత భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెసు పార్టీలో చేరారు.

మామ నాటి వైరం: బాబుపై దగ్గుబాటి ఫైట్

చంద్రబాబు పోరులో దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆధిపత్యం సాధించలేకపోతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు పార్టీలో చేరిన ఆయన సతీమణి పురంధేశ్వరికి చంద్రబాబుకు పోటీకి దిగుతున్నారు. ఆమె పోరుకు దగ్గుబాటి తన వంతు సహాయం చేస్తున్నారు.

English summary
The fight between Telugudesam party president N Chandrababu Naidu and Congress party MLA Daggubati Venkateswara Rao is not a new one, From the beginning they are fighting in politics with each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X