• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీపై ప్రశంసలు: ఐశ్వార్యపై జయా బచ్చన్ అసంతృప్తి

By Pratap
|

Jaya Bachchan-Aishwarya Rai
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని తన కోడలు ఐశ్వర్యా రాయ్ ప్రశంసలతో ముంచెత్తడంపై సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు, సినీ నటి జయా బచ్చన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని సమాచారం. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తమ ప్రత్యర్థి మోడీని ఐశ్వర్యా రాయ్ కొనియాడడం జయా బచ్చన్‌కు నచ్చలేదని అంటున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న బిజెపికి ఎన్నికల సమయంలో ఐశ్వర్యా రాయ్ వ్యాఖ్యలు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐశ్వర్యా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిపై ఆమె చేసిన ప్రశంసలు మోడీకే చెందుతాయి. ఆదివారం ఆమె వడొదరలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె గుజరాత్ అభివృద్ధిపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

గుజరాత్ విజయగాథ తనను ఎంతో ముగ్ధురాలిని చేసిందని, నిజంగా అత్యంత అభినందనీయమైన విషయమని అన్నారు. గుజరాత్ సాధించిన విజయాల గురించి తనకు తెలుసునని, తనకు ఇక్కడ ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుందన్నారు. నానాటికి గుజరాత్ బలోపేతమవుతోందని... ఈ విజయాన్ని తాను మనసారా అభినందిస్తున్నానని చెప్పారు. గుజరాత్ విజయగాథకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.

ఐశ్వర్ రాయ్ మామ అమితాబ్ బచ్చన్ గుజరాత్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ వల్ల గుజరాత్ పర్యాటక రంగంలో అనూహ్యమైన మెరుగుదల కనిపించిందని, సందర్శకుల సంఖ్య పెరిగిందని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా చెప్పుకుంటోంది.

English summary
Amid war of words between the Congress and BJP over the development of Gujarat ahead of polls, Bollywood actor Aishwarya Rai Bachchan upsets Jaya as she praised the opposite party workings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X