• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమితాబ్‌కు ఇష్టం ఉండదు: లోకసభపై జయాబచ్చన్

By Srinivas
|

Jaya Bachchan-Amitabh Bachchan
లక్నో: తాను లోకసభకు పోటీ చేయడం తన భర్త, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఇష్టం ఉండదని సమాజ్‌వాది పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ ఆదివారం అన్నారు. తాను ఎప్పుడూ లోకసభకు పోటీ చేసే అవకాశాలు లేవన్నారు. తన భర్తకు తాను లోకసభ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పారు. లోకసభకు పోటీ చేసే పరిస్థితులు ఎదురైతే తనను ఇంట్లో కూర్చోమని చెప్పారన్నారు.

మాజీ సమాజ్‌వాది పార్టీ నేత అమర్ సింగ్ పైన స్పందించేందుకు జయాబచ్చన్ నిరాకరించారు. ములాయం సింగ్‌కు, ఎస్పీకి దూరమైన అమర్ సింగ్ తిరిగి పార్టీలోకి వస్తారా అని మీడియా జయాను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందించేందుకు నిరాకరించారు. అదంతా అయిపోయిందని, దాని గురించి తానేమీ మాట్లాడనని చెప్పారు.

కాగా 1948 ఏప్రిల్ 9వ తేదిన పుట్టిన జయాబచ్చన్ పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేశారు. రెండుసార్లు సమాజ్ వాది పార్టీ నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండుసార్లు ఆమె ఎస్పీ అభ్యర్థిగానే రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండోసారి 2012లో ఇటీవల ఎన్నికయ్యారు.

English summary
SP MP in Rajya Sabha and well known actress Jaya Bachchan has said that she would never contest lok Sabha elections because her husband superstar Amitabh Bachchan did not want her to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X