హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొచ్చి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు: హైదరాబాద్‌లో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kochi Airport
కొచ్చి/హైదరాబాద్: కొచ్చి విమానాశ్రయానికి బెదిరింపు కాల్ వచ్చింది. విమానాశ్రయానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టారని బెదిరించడంతో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం అడుగడుగునా గాలించారు. అయితే ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేది అధికారులు తెలియజేశారు.

మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు సిబ్బందికి చెప్పాడని ఎయిర్ పోర్డు డైరెక్టర్ ఎకెసి నాయర్ చెప్పాడు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఆ బాంబును ఖచ్చితంగా ఎక్కడ పెట్టారో స్థలం చెప్పలేదన్నాడు. విమానాశ్రయం అంతా గాలిస్తున్నామని ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి బాంబు ఉన్న దాఖలాలు తేలలేదని నాయర్ అన్నారు.

ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి కాల్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ నుండి వచ్చిందని చెప్పాడు. విమానాశ్రయంతో పాటు కొచ్చిలో ఉన్న అన్ని ఫ్లైట్‌లలో కూడా చెక్ చేశారు. ఈ రోజంతా గాలిస్తామని నాయర్ చెప్పారు. బెదిరింపు కారణంగా ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.

హైదరాబాదులో....

మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ అరేబియా విమానం ఒకటి అత్యవసరంగా దిగింది. సౌదీ అరేబియాకు చెందిన ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇక్కడ ల్యాండ్ అయినట్లు అధికారులు చెప్పారు. విమానంలో 160 మంది ప్రయాణీకులు ఉన్నారు.

English summary
Police and CISF personnel are on high alert at the Kochi Airport at nearby Nedumbassery following an anonymous call this morning that a bomb had been planted there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X