చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రుయాలో కి'లేడీ' డాక్టర్: చనిపోయిన వ్యక్తి సర్టిఫికేట్‌తో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఓ నకిలీ వైద్యురాలి బాగోతం బయటపడింది. చనిపోయిన వ్యక్తి సర్టిఫికేట్‌తో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అలేఖ్య అనే మహిళ ముంతాజ్ అనే మృతి చెందిన డాక్టర్ స్థానంలో ఆమె సర్టిఫికేట్‌లతో వైద్యురాలిగా చలామణి అవుతోంది.

అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది తనిఖీ చేయడంతో ఈ బాగోతం బయటపడింది. అలేఖ్య రుయాలోనే హౌస్ సర్జన్‌గా పని చేస్తోంది. తనకు ఎంబిబిఎస్ డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉంది. గడిచిన ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదు. దీంతో ఇలా వక్రమార్గం పట్టింది. అలేఖ్యకు పెళ్లయింది.

ఈమె తండ్రి తిరుమలలో దుకాణాన్ని నడిపిస్తున్నాడు. తనకు ఈ విషయం తెలియదని, తన భార్య కేవలం హౌస్ సర్జన్‌గా మాత్రమే పని చేస్తున్నట్లుగా తనకు తెలుసునని, నకిలీ డాక్టర్ వ్యవహారం తెలియదని, ఆమె తండ్రిని అడిగి వివరాలు తెలుసుకుంటానని భర్త చెబుతున్నాడు. అలేఖ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

విశాఖలో దొంగల అరెస్టు

విశాఖపట్నం జిల్లా భీమిలిలో పోలీసులు నలుగురు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 25 తులాల బంగారం, రూ.25వేల నగదు, ఆరు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Duplicate doctor was arrested in Ruya Hospital on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X