వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ తెరాసలోకి పిలిచారు, పరిశీలిస్తా: మందా

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Jagannadham
న్యూఢిల్లీ: పార్టీలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనను ఆహ్వానించారని కాంగ్రెసు మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టత రాకపోతే కెసిఆర్ ఆహ్వానాన్ని పరిశీలిస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసులోని కొంత మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పార్టీలోకి వస్తారని కెసిఆర్ చెబుతూ వస్తున్నారు.

ఢిల్లీలో చక్కర్లు కొట్టడం మానేసి తమతో కలిసి రావాలని కెసిఆర్ బహిరంగంగానే బుధవారం పిలుపునిచ్చారు. కెవి రంగా రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ ఆహ్వానం అందించారు. ఇటీవల ఢిల్లీలో కెసిఆర్ ముగ్గురు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మందా జగన్నాథం, రాజయ్య, వివేక్‌లతో సమావేశమయ్యారు. ఆ సమయంలో వదంతులు పెద్ద యెత్తున వ్యాపించాయి.

ఎఫ్‌డిఐలపై లోకసభలో ఓటింగు సందర్భంలో కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావడం వల్లనే లోకసభకు గైర్హాజరవుతామని వారు చెప్పినట్లు భావిస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు తెలంగాణపై డిసెంబర్ 28వ తేదీన తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పార్టీ సభ్యులను కాంగ్రెసు అధిష్టానం బుజ్జగించింది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా కాలంగా వివేక్ గట్టిగా మాట్లాడుతున్నారు. దాదాపుగా ఆయన తెరాసలో చేరడానికే నిర్ణయించుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం అంగీకరించకపోతే తాము వేరే పార్టీలను చూసుకుంటామని నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ మధ్య చెప్పారు.

English summary
Congress Telangana MP manda Jagannatham confirmed the invitation of Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar to join in his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X