వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు నీరుగార్చేందుకే: కెటిఆర్, మానుకోట మళ్లీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kalwakuntla Taraka Rama Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును నీరుగార్చేందుకే మంత్రి ధర్మాన ప్రసాద రావును సిబిఐ ప్రాసిక్యూషన్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుమతించడం లేదని సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం అన్నారు. మంత్రులను కాపాడేందుకు న్యాయసహాయం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదుల విచారణకు ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు.

న్యాయవాదులకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారన్నారు. ధర్మాన విచారణకు అనుమతించని ప్రభుత్వం న్యాయవాదులకు జివో జారీ చేయడం వెనుక ఉద్యమాన్ని అణిచి వేసే కుట్ర ఉందన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. లేదంటే వారి యాత్రలను పరుగు యాత్రలుగా తెలంగాణ ప్రజలు మార్చుతారన్నారు.

తెలంగాణ కోసం తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్లో తెలంగాణకు 42 శాతం వాటా దక్కాల్సిందే అన్నారు. కేసులను అడ్డం పెట్టుకొని తమతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే అంటున్నారన్నారు.

కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో అంబేడ్కర్ సర్కిల్ వద్ద తెలంగాణ కోసం దీక్షలు చేస్తున్న శిబిరాన్ని హరీష్ రావు, ఈటెల రాజేందర్ సందర్శించారు. వేల కోట్లు దోచిన మంత్రులను వదిలేసి న్యాయవాదులను విచారణకు ఆదేశించడమేమిటని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు పేరుతో జివో తీసుకు వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు నిమిషాలు మౌనం అనడం తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడమే అన్నారు.

English summary
TRS MLA Kalwakuntla Taraka Rama Rao has blamed Kiran Kumar Reddy government for released new GO to presecute Telangana lawyers based on SC court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X