వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు మీ గురించి చెప్తా, చిరుకు అది గిఫ్ట్: విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
చిత్తూరు: చిత్తురు పేరు చెబితే మొదట ఎవరికైనా ఆపదమొక్కుల వాడు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం అన్నారు. విజయమ్మ సమక్షంలో తంబళ్లపల్లి శాసనసభ్యుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి చిరంజీవిపై నిప్పులు చెరిగారు.

ఈ సభకు వచ్చేముందు తాను జగన్‌ను కలిస్తే కార్యకర్తలను, ప్రవీణ్‌ను అభినందించమని చెప్పారని, తాను కూడా జగన్‌కు మీరు చూపించిన అభిమానాన్ని తెలియజేస్తానన్నారు. సొంత జిల్లా చిత్తూరుకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. తన హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీని ముంచాడన్నారు. బాబుకు చిత్తశుద్ధి, విలువలు లేవన్నారు. వాల్ మార్ట ప్యాకేజీలో బాబు వాట ఎంతో చెప్పాలన్నారు. ఆ పార్టీ ఎంపీలు ముగ్గురు ఎఫ్‌డిఐలపై ఓటింగు జరుగుతున్న సమయంలో గైర్హాజరయ్యారని గుర్తు చేశారు.

అవిశ్వాసం పెట్టకుండా బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నారన్నారు. అందుకే ఆయనపై కేసులు లేవన్నారు. కొడాలి నాని, తానేటి వనిత, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలనాగి రెడ్డి.. ఇలా వరుసగా టిడిపి ప్రజాప్రతినిధులు తమ వైపుకు ఎందుకు వస్తున్నారో బాబు ఆలోచించాలన్నారు. తాము ప్యాకేజీలు ఇస్తామంటున్న బాబు వైస్రాయ్ హోటల్లో ఎవరికి ఎంత ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలన్నారు.

చంద్రబాబు పాదయాత్రలో మోసపూరిత హామీలు ఇస్తున్నారన్నారు. దివంగత వైయస్ పథకాలే తమ మేనిఫెస్టో అని టిడిపి మేనిఫెస్టో ఏమిటో చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. జగన్‌కు అన్ని ప్రాంతాల వారు సమానమన్నారు. చిదంబరాన్ని బాబు చీకట్లో కలుస్తారని ఆరోపించారు. అందుకే ఆయనపై కేసులు ఉండవన్నారు. చిరంజీవి రిలేషన్స్ ఇంట్లో రూ.35 కోట్లు దొరికినా కేసులు ఉండవని పైగా బహుమతిగా మంత్రి పదవి ఇచ్చారన్నారు.

జగన్ కాంగ్రెసులోనే ఉంటే కేంద్రమంత్రి పదవి గానీ ముఖ్యమంత్రి పదవి గానీ వచ్చి ఉండేదని ఆజాద్ స్వయంగా చెప్పారన్నారు. వైయస్ జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కోర్టులు దోషులుగా తేల్చలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు పలికి వైయస్ ప్రతి కలను నిజం చేసుకుందామన్నారు. కాగా ఈ కార్యక్రమానికి రోజా, అమర్నాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు వచ్చారు.

English summary
Tamballapalli MLA Praveen Kumar Reddy was joined in YSR Congress party on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X