వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలచివేసిన కాల్పుల్లో మరణించిన చిన్నారి లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

A boy writes letter to his mother before dying in gun shooting
న్యూటౌన్: కాల్పుల్లో మరణించడానికి ముందు ఓ చిన్నారి తన తల్లికి రాసిన ఓ లేఖ అందరినీ కలచివేసింది. "అమ్మా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్లూ నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. స్వర్గానికి వెళ్లిన తరువాత కూడా నిన్ను ప్రేమిస్తా!'' అంటూ ఆ చిన్నారి తన తల్లిని వేడుకుంటూ ఆ లేఖ రాశాడు. కొద్ది క్షణాల్లో మరణిస్తాడని ఎలా తెలుసుకున్నాడో లేఖ గాయపడిన తర్వాత మరణిస్తానని తెలిసి ఆ లేఖ రాశాడో తెలియదు గానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మకు తన అంతరంగం చెప్పాలనుకున్నాడు ఆ బాలుడు.

తన ప్రాణానికి ముంచుకొస్తున్న ముప్పును చూసి వెంటనే లేఖ రాసి పెట్టాడు. సాండీ హూక్ పాఠశాలలో ఆగంతకుడి కాల్పుల్లో మరణించేముందు స్కూల్ విద్యార్థి బ్రియాన్ రాసిన ఈ లేఖ.. అధికారులకు లభించింది. హృదయాన్ని కలిచివేసేలా ఓ చిన్నారి రాసిన లేఖ అమెరికా వాసులనే కాదు.. దేశాధ్యక్షుడు ఒబామానూ కంట తడి పెట్టించింది. పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 20 మంది పిల్లలతో పాటు మొత్తం 28 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే, కాల్పుల ఘటనలో మృతుల వివరాలను ఆదివారం వెల్లడించారు. చనిపోయిన చిన్నారుల్లో 12 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ డాన్ హూచ్‌స్ప్రంగ్ (47), సైకాలజిస్ట్ మేరీ షెర్లాచ్ (56), టీచర్లు రాచెల్ డేవినో (29), ఆనే మేరీ మర్ఫీ (52), లారెన్ రొసేవూ (30)లు కూడా మృతుల్లో ఉన్నట్టు చెప్పారు. పిల్లలను రక్షించే క్రమంలో ప్రిన్సిపల్, సైకాలజిస్ట్‌లు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.

కాగా, సాండీ హూక్ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరామర్శించారు.

English summary

 A student Brain's letter, addressing to his mother was found at the school, where the gun firing has been taken place in New Tiwn of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X