వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి కారణంగా ఉన్మాదిగా: హగ్ చేసుకోవట్లేదని అప్‌సెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dysfunctional relationship of gunman and hit mother
వాషింగ్టన్: అమెరికాలోని పాఠశాలలో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉన్మాది తన తల్లి కారణంగానే హంతకుడిగా మారాడట. ఈ విషయం అధికారుల విచారణలో తేలింది. నిందితుడు ఆడం లాంజా తన తల్లి నాన్సి కారణంగానే ఇలా తయారయ్యాడట. తల్లి ఓ మానసిక రోగి. ఆమె పెంపకంలోనే ఆడం ఉన్మాదిలా తయారయ్యాడని అధికారులు గుర్తించారు. ప్రపంచమంతా త్వరలో నాశనం కానుందన్న భ్రమతో నాన్ని.. తన ఇంట్లోనే ఆహారాన్ని, నీళ్లను, తుపాకులను పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంది.

తన ఇద్దరు కుమారులు ఆడం, రెయాన్‌లకు తుపాకిని కాల్చడంలో తరుచూ శిక్షణ ఇప్పించేది. ఈ విధమైన వాతావరణంలో పెరిగిన ఇరవై ఏళ్ల ఆడం తానూ ఓ ఉన్మాదిలా మారాడు. శుక్రవారం ఇంట్లోనే తన తల్లిని కాల్చి చంపేసి.. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లి పిల్లలపై తుపాకీ గుళ్లను కురిపించాడు.

ఆడం తన తల్లిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిపాడు. తన కొడుకు ఆడం తనను హగ్ చేసుకునేందుకు ఇష్టపడక పోవడం తల్లి నాన్సీని అప్ సెట్‌కు గురి చేసేదట. ఆడం ఎప్పడూ తన గదుల్లోనే ఉండేందుకు ఇష్టపడేవాడు. నాన్సి 1998 నుండి శాండీ హుక్ పాఠశాలలో పని చేస్తోంది. ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు.

English summary
A young gunman killed his mother and 28 other people, including 20 children, when he went on a shooting rampage inside a US school, before turning the gun on himself, in one of the deadliest such incidents witnessed in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X