గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్ఞాతంలోటిడిపి ఎమ్మెల్యే యరపతినేని: పోలీసులవేట?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస రావు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాదయాత్రలో పాల్గొన్న యరపతినేని హఠాత్తుగా తన గన్‌మెన్‌లతో తాను న్యూఢిల్లీ వెళ్లిపోతున్నాని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతను కనిపించక పోవడంతో గన్‌మెన్‌లు పోలీసులకు తెలియజేశారు.

యరపతినేని జాడ తెలుసుకునేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. యరపతినేని ఢిల్లీకి వెళుతున్నానని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక ఓ కేసుకు సంబంధించి పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతోనే. గత నెల 27న పిడుగురాళ్లలో కాంగ్రెసు పార్టీకి చెందిన నరేంద్ర హత్య జరిగింది.

ఈ కేసులో యరపతినేని ప్రమేయముందని హత్యకు గురైన నరేంద్ర బంధువులు ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో యరపతినేని మూడో నిందితుడు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసులు ఇప్పటికి 13 మందిని అరెస్టు చేశారు.

ఒక్క యరపతినేని అరెస్టు చేయాల్సి ఉంది. కానీ అతను అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. యరపతినేని అరెస్టుకు బలమైన ఆధారాలు ఉన్నాయని, అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. యరపతినేని అంగరక్షకులను, ఉపయోగించే వాహనాన్ని పిడుగురాళ్లలో వదిలి వెళ్లాడు. అతని కోసం హైదరాబాదులో కూడా గాలిస్తున్నారు.

English summary
Guntur police are searching for Gurajala MLA Yarapathineni Srinivas Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X