వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ అన్ని సీట్లు గెలవడం కష్టమే అంటున్న బూకీలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గుజరాత్‌లో తిరిగి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హవా మూడోసారి కొనసాగనుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెసు, బిజెపి మధ్య పోటీ పోటీ ఉంటుందని అయితే, అంతిమంగా కాంగ్రెసు పార్టీకి స్వల్ప ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

మోడీకి వ్యతిరేకంగా బూకీలు

ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హవా ముచ్చటగా మూడోసారి కొనసాగడం ఖాయమని ఓ వైపు సర్వేలు ఎలుగెత్తి చాటుతుండగా గుజరాత్ బూకీలు మాత్రం అందుకు భిన్నంగా బెట్టింగ్స్ కట్టారట. బిజెపి సులభంగా గెలుస్తుందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, 130 నుండి 145 సీట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే బూకీలు మాత్రం పోటాపోటీగా ఉంటుందని చెబుతున్నారట.

Narendra Modi

బిజెపి 100 సీట్లు గెలుచుకునే అవకాశాలు కూడా కష్టమే అంటున్నారట. గుజరాత్‌లో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. సీట్లు గతంలో కంటే వచ్చినప్పటికీ బిజెపినే పీఠం కైవసం చేసుకుంటుంది. కానీ మిగిలిన సర్వేలతో పోలిస్తే బూకీలు మాత్రం ముప్పై నుండి నలబై సీట్ల వరకు బిజెపికి తక్కువగా వస్తాయని చెబుతుండటం గమనార్హం. మోడీ మూడోసారి ఖచ్చితంగా గెలుస్తారని అయితే, అతని ప్రధాని ఆశలపై గుజరాత్ ఫలితాలు నీళ్లు జల్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారట.

2007 సాధారణ ఎన్నికల్లో బిజెపి 117 స్థానాలను గెలుచుకుంది. ఈసారి అంతకంటే ఎక్కువ అని సర్వేలు చెబుతుంటే బూకీలు తక్కువ వస్తాయంటున్నారు. బిజెపి అత్తెసరు సీట్లతో అధికారంలోకి వస్తే మోడీ ప్రధాని రేసులో ఉండటం కష్టమే. భారీ మెజార్టీతో గెలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకే మోడీ కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లపై ధీమాతో ఉన్నారు. కాగా గుజరాత్ ఎన్నికలపై దాదాపు రూ.5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయట.

మోడీ విజయం పైనే ఎక్కువ మంది బెట్లు కాశారట. అయితే కష్టంగా వంద సీట్లు వస్తాయని మాత్రం కాశారట. బూకీలు బిజెపికి వంద సీట్లు వస్తాయని వందకు 114 పైసలు బెట్ కట్టాయట. ఇప్పుడు అది 117 పైసల వరకు కూడా నడుస్తోందట. కాంగ్రెసు 65 సీట్లకు పైగా గెలుస్తుందని బూకీలు 500 పైసలు బెట్ కడుతున్నారట.

English summary
While exit polls and post-poll surveys have predicted a landslide victory for Narendra Modi in the Gujarat Assembly Elections 2012, the bookies in the state have a different view on the incumbent chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X