వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఫలితాలు: బిజెపి ముందస్తు లీడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP leads Congress 9-5 in Guj, 2-1 in HP
గాంధీనగర్: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభా ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఆధిక్యతలో కొనసాగుతోంది. గజురాత్‌లో బిజెపి పది స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెసు ఐదు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి రెండు స్థానాల్లో, కాంగ్రెసు ఒక స్థానలో అధిక్యంలో ఉన్నారు.

ఇది ముందుకు చూసే సమయమని, వెనక్కి తగ్గేది లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. బిజెపికి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందని గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్ని సీట్లు తమకు వస్తాయనేది కాలమే చెబుతుందని కాంగ్రెసు నాయకుడు ఎ అగ్నీక్ అన్నారు. ఊహాగానాలు చేయడం సరి కాదని అన్నారు.

హిమాచల్ ‌ప్రదేశ్‌లో నవంబర్ 4వ తేదీన పోలింగ్ జరిగింది. ఓటర్లు పెద్ద యెత్తున పోలింగులో పాల్గొన్నారు. బిజెపి, అధికార కాంగ్రెసు పార్టీలకు మధ్యకు నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉందని చెబుతున్నారు.

గుజరాత్‌లో నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. మోడీ హ్యాట్రిక్ దిశలో సాగుతుండగా, బిజెపిని కాదని సొంత కుంపటి పెట్టుకున్న కేశూభాయ్ పటేల్‌కు పరాభవం తప్పదని భావిస్తున్నారు.

English summary

 The results of the Gujarat and Himachal Pradesh elections are to be announced today. Will Narendra Modi complete a hat-trick? Will Keshubhai Patel spoil his party? Will the Congress stage a turnaround in Himachal Pradesh?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X