వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు: ఎవరెవరు ఎక్కడ గెలిచారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Keshubhai Patel-Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మణి నగర్ నుండి మోడీ ఘన విజయాన్ని సాధించారు. అయితే గత ఎన్నికల కంటే మెజార్టీ తగ్గింది. మోడి 85వేల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెసు తన అభ్యర్థిగా శ్వేతా భట్‌ను బరిలోకి దింపింది.

మోడీ విజయంపై కేంద్రమంత్రి చిదంబరం స్పందించారు. గుజరాత్‌లో బిజెపి గెలిచినప్పటికీ కాంగ్రెసు గెలిచినట్లే లెక్క అన్నారు. మోడీ ప్రభావాన్ని తాము సమర్థవంతంగా అడ్డుకోగలిగామన్నారు. మరోసారి గుజరాత్ ప్రజలు మంచి భవిష్యత్తుకు పట్టం కట్టారని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జామ్ నగర్ రూరల్ ప్రాంతంలో నుండి పోటీ చేస్తున్నారు. అతను వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాఘవ్ జీ పటేల్ ముందంజలో ఉన్నారు. పోరుబందర్ నుండి పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు కూడా ఓటమి బాటలో ఉన్నారు.

గుజరాత్ విపక్ష అధ్యక్షుడు శక్తిసింగ్ గోహెల్ ఓడిపోయారు. మోడీ మంత్రివర్గంలో నలుగురు మంత్రులు ఓడిపోయారు. హరేన్ పాండ్యన్ భార్య జాగృతి జిపిపి పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 12 మేజర్ ముస్లిం నియోజకవర్గాలలో ఎనిమిదింటిలో బిజెపి జెండా ఎగురవేసింది.

బిజెపి

మణి నగర్‌ - నరేంద్ర మోడి
మంగ్రోల్‌ - రాజేష్ బాయ్
గోండోల్ - జయరాజ్ సింగ్
నారాయణపూర్ - అమిత్ షా
గోద్రా - ప్రవీణ్ సింగ్ చౌహాన్
నవ్వారీ - పీయూష్ దేశాయ్
రాజ్‌కోట పశ్చిమ - వాజూభాయ్ వాలా
సబర్మతి - అరవింద్ పటేల్
భావనగర్ రూరల్ - పురుషోత్తం సింగ్ సోలంకి
మొహ్సానా - నితిన్ పటేల్
పోరుబందర్ - బాబూభాయ్ పోఖ్రియా

రావుపురా - రాజేంద్ర ద్వివేది
శియాజీగంజ్ - జితేంద్ర సుఖాడియా
అకోటా - సోరబ్ భాయ్ పటేల్

కాంగ్రెస్

దహోద్ - వాజే సింగ్ పాండా
అమ్రేలి - పరేష్ భాయ్ ధనానీ
హిమ్మత్ నగర్ - రాజేంద్ర సింగ్ చౌడా
జెత్పూర్ - జయేష్ రాడేదియా
బయాద్ - మహేంద్ర సింగ్ వాఘేలా
కపడ్వంజ్ - శంకర్ సింగ్ వాఘేలా

గుజరాత్ పరివర్తన్ పార్టీ(జిపిపి)

విశ్వధర - కేశూభాయ్ పటేల్

ఎన్సీపి

ఉమరేత్ - జయంత్ పటేల్

English summary
The ruling BJP has a comfortable lead in Gujarat. In Himachal Pradesh a close contest is on between the BJP and Congress. Counting of votes is underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X