వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25న ప్రమాణం: ప్రత్యర్థికి స్వీట్ తినిపించిన నరేంద్ర మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Keshubhai Patel-Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నరేంద్ర మోడీ ఈ నెల 25వ తేదిన మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 182 స్థానాలకు గాని బిజెపి 116 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. గతంలో ఈ సంఖ్య 117 ఉండగా ఈసారి ఒక స్థానం తక్కువగా గెలుచుకుంది.

ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ 60 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 59 సీట్లలో గెలుపొందింది. కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ(జిపిపి) రెండు, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) ఒకటి, ఇతరులు మూడు సీట్లలో గెలుపొందారు. ఎన్సీపి గత ఎన్నికల్లో మూడు గెలుపొందగా ఇప్పుడు ఒక దానితో సరిపెట్టుకుంది. జెడియు గతంలో ఒక స్థానంలో గెలిచింది. ఈసారి దానిని కూడా కోల్పోయింది.

కాగా ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర మోడీ మొదట తన తల్లి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కొడుకు భారత ప్రధాని అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తనతో విభేదించి వెళ్లి జిపిపి పేరుతో కొత్త కుంపటి పెట్టుకొని తనను దెబ్బతీయాలని భావించిన కేశూభాయ్ పటేల్ ఇంటికి మోడీ వెళ్లారు. ఆయనకు స్వీట్ తినిపించారు. దెబ్బతీయాలనుకున్న కేశూభాయ్ ఇంటికి వెళ్లి మోడీ స్వీట్ తినిపించడం చర్చనీయాంశమైంది.

English summary
Modi to be sworn in as CM for 4th time on Dec 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X