వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్మిషన్ అవసరంలేదు: మోపిదేవి,ధర్మానకు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkata Ramana and Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితులైన మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలకు సిబిఐ కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఛార్జీషీటులో పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్13(1)(సి)(డి)ల కింత విచారణకు స్వీకరించాలంటూ సిబిఐ దాఖలు చేసిన మోమోపై కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.

ఇప్పటికే ఐపిసి సెక్షన్ల కింద అభియోగాలను కోర్టు పరిగణనలోకి తీసుకోగా, తాజాగా అవినీతి నిరోధక చట్టం-1988 కింద తాము నమోదు చేసిన అభియోగాలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన నాంపల్లి సిబిఐ కోర్టు వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 31కి వాయిదా వేసింది. మంత్రులు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

జగతికి నిధుల పెట్టుబడుల వ్యవహారంలో అప్పటి మంత్రులు ధర్మాన, మోపిదేవి, నలుగురు సీనియర్ ఐఏఎస్‌లపై సిబిఐ వివిధ సెక్షన్ల కింద నేరాభియోగాలను నమోదు చేసింది. దీంతో ధర్మాన, మోపిదేవిపై పిసి యాక్ట్ కింద నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా మెమో దాఖలు చేసింది. నేరం జరిగినప్పుడు ఉన్న పదవుల్లో వారు ఇప్పుడు లేనందున పిసి యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన వారికి వర్తించదన్నారు.

చౌతాలా కేసులో సుప్రీం తన తీర్పులో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని సిబిఐ కోర్టుకు వివరించింది. తాము అరెస్టు చేసే నాటికి మంత్రి మోపిదేవి ఎమ్మెల్యేగానే ఉన్నారని ఆ కారణంగా, ఆయన ప్రాసిక్యూషన్‌కు తాము అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరలేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

English summary
CBI has issued notices to Mopidevi Venkata Ramana and Dharmana Prasad Rao on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X