వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్: న్యాయంపై సోనియా హామీ, తగ్గని ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఐ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆందోళనకారులతో మాట్లాడారు. గ్యాంగ్ రేప్ ఘటన ఢిల్లీలో వారం రోజులుగా చర్చనీయాంశమైంది. నిందితులను శిక్షించాలని ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఆదివారం సోనియా, రాహుల్ గాంధీలు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. మేము మీతో ఉన్నామని... న్యాయం జరిగేలా చూస్తామని వారికి శనివారం అర్ధరాత్రి హామీ ఇచ్చారు.

అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో సోనియా వారితో దాదాపు ఇరవై నిమిషాల పాటు మహిళలకు రక్షణ అంశంపై మాట్లాడారు. 10 జనపథ్‌లోని తన ఇంటి నుండి బయటకు వచ్చిన సోనియా కింద కూర్చొని మాట్లాడారు. తాను మీతో ఉన్నానని, ఎప్పటిలోగా న్యాయం చేయగలమో చెప్పలేమని అయితే న్యాయం మాత్రం తప్పకుండా చేస్తామని, అందుకోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామని సోనియా ఆందోళనకారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆందోళనకారులు సోనియా గాంధీకి డెడ్ లైన్ పెట్టగా.. డైడ్ లైన్ లాంటివేవీ లేవని.. అయితే కఠిన చర్యలు మాత్రం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం కూడా ఆందోళనకారులు ఢిల్లీ రోడ్ల పైకెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు మెట్రో రైలు గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటరియేట్, ఉద్యోగ్ భవన్, రేసు కోర్సు తదితర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్స్ మూతపడ్డాయి.

అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందించాలని సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే అన్నారు. అత్యాచారాలపట్ల నిరసన తెలుపుతూ న్యాయం కావాలని దేశవ్యాప్తంగా నినదిస్తున్న యువతకు హజారే తన మద్దతు పలికారు. వ్యాపారస్తులు, సంఘ విద్రోహశక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసి ఏమాత్రం భయపడటం లేదనడానికి నిదర్శనం ఢిల్లీ సంఘటన అన్నారు.

English summary
"I am with you...and justice will be delivered." This is what Congress chief Sonia Gandhi told a group of protesters outside her 10-Janpath residence shortly after midnight on Saturday, Dec 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X