వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూరీడు ఇంట్లో ఎసిబి సోదాలు: రిపుంజయరెడ్డితో లింక్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sureedu
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శులుగా(పిఏ)లుగా పని చేసిన సూరీడు, రిపుంజయ రెడ్డి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వీరిద్దరు వైయస్ హయాంలో ఆయన పిఏలుగా పని చేశారు. సూరీడు ఆ తర్వాత తెరమరుగు అయ్యారు. రిపుంజయ రెడ్డి కొంతకాలం క్రితం ఎపిపిఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు.

రిపుంజయ రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యుడు అయ్యాక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అభియోగాలు ఉన్నాయి. సూరీడు, రిపుంజయ రెడ్డి ఇద్దరు కలిసి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.

రిపుంజయ రెడ్డికి చెందిన నాలుగు చోట్ల ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సూరీడు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని యూసఫ్‌గూడలో ఉంటున్న రిపుంజయ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. వెంకటగిరిలో ఆరు ఫ్లాట్లు, రాయలసీమలో కొంత భూమిని రిపుంజయ రెడ్డి కొనుగోలు చేసినట్లుగా ఎసిబి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌లోని గాయత్రి నగర్‌లో సూరీడు ఇళ్లు ఉంది. అక్కడ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎపిపిఎస్సీ సభ్యుడు రిపుంజయ రెడ్డితో సంబంధాల నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు సూరీడు ఇంటి పైన కూడా ఎసిబి దాడులు చేసి సోదాలు నిర్వహిస్తోంది. మొత్తంగా నాలుగైదు చోట్ల ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. రిపుంజయ రెడ్డి ఇంట్లో కీలక పత్రాలను పరిశీలిస్తోంది.

English summary
The AP Anti Corruption Bureau(ACB) on Tuesday raided on Sureedu, who was PA to late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X