• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇద్దరు బిజినెస్ చేశారు: ఎసిబి, స్పందించిన సూరీడు

By Srinivas
|
Sureedu
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడు, రిపుంజయ రెడ్డి కలిసి వ్యాపారాలు చేశారని ఎసిబి డిఎస్పీ చంద్రశేఖర్ బుధవారం అన్నారు. సూరీడు, రిపుంజయ రెడ్డి ఇళ్లలో ఎసిబి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు కలిసి వ్యాపారాలు చేశారని, వారి వ్యాపార లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఎనిమిది బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నామని, రిపుంజయ రెడ్డికి సంబంధించి ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయన్నారు. ఐదుచోట్ల బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందన్నారు. తార్నాక, హకీంపేట, కొండాపూర్, రాజేంద్రనగర్, కడపలలో ఇళ్లు ఉన్నట్లుగా తేలిందన్నారు. కడపలో 36 ఏకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కనుగొన్నట్లు చెప్పారు. అరకిలో బంగారం, లాకర్‌లో రూ.30 లక్షల నగదును గుర్తించినట్లు చెప్పారు.

కొండాపూర్‌లో 600 గజాల స్థలం ఉన్నట్లు తేలిందని, 2008 నుంచి రిపుంజయ రెడ్డి ఆస్తులు సంపాదిస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. కాగా అయ్యప్ప సొసైటీలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరూర్ వైశ్య బ్యాంకులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా సమాచారం. వెంకటగిరిలో ఒకే అపార్టులమెంటులో ఆరు ప్లాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. రిపుంజయ రెడ్డి, సూరీడు ఇళ్లలో నుండి కీలక పత్రాలు ఎసిబి స్వాధీనం చేసుకున్నారు. ఓ సమయంలో రిపుంజయ రెడ్డికి ఎసిబి అధికారులకు మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.

కాగా ఎసిబి సోదాలపై సూరీడు స్పందించారు. రిపుంజయ రెడ్డి, తాను కలిసి వ్యాపారాలు చేసినట్లుగా చెప్పారు. అతని ఆస్తులకు సంబంధించిన పత్రాలు తన ఇంట్లో ఉన్నాయనే అనుమానంతోనే ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సూరీడు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YS Rajasekhar Reddy's PA Sureedu has responded on ACB raids on Ripunjaya Reddy and his residence on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more