హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తల్లిలో దొరసాని రూపురేఖలు: మందకృష్ణ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహంలో దొరసాని రూపు రేఖలు కనిపిస్తున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బుధవారం ఆరోపించారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలు దళిత నేతలనే ప్రతినిధులుగా పంపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలన్నారు.

అఖిల పక్ష సమావేశానికి పార్టీ అధినేతలు వెళ్లాలని లేని పక్షంలో పార్టీలోని దళిత ప్రతినిధులను పంపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ నుండి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. ట్యాంకుబండు పైన తెలంగాణ కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న విమలక్క అరెస్టు పైన కెసిఆర్, తెరాస ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విమలక్కను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను విడుదల చేయని పక్షంలో వచ్చే సంవత్సరం జనవరి 3 నుండి వరంగల్ నుండి ఆమె విడుదలను కోరుతూ పాదయాత్ర చేస్తానన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ కాలయాపన చేస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

English summary
MRPS president Manda Krishna Madiga has alleged that the Telangana Talli statues are appearing like Dorasanis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X