వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ ట్రెజరర్ కిరణ్ కుమార్ రెడ్డి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోశాధికారి పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పిఆర్ కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించాక ఇప్పుడు ఆ పార్టీ కోశాధికారిగా ఉన్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా విషమంగా ఉంది. కొద్ది నెలలుగా ఆయన ఆపోలో ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన ఆరోగ్యం అకస్మికంగా క్షీణించింది. దీంతో ఆయనను వెంటిలెటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రెండు రోజుల క్రితం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతిలు పరామర్శించారు.

కిరణ్ కుమార్ రెడ్డిది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామర మడుగు గ్రామం. ఆయనకు దివంగత వైయస్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. కిరణ్ మృతదేహానికి వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు నివాళులు అర్పించారు. కిరణ్ మృతిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

English summary
YSR Congress Party treasurer PR Kiran Kumar Reddy was died on Wednesday in Hyderabad while taking treatment in Apollo Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X