హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీరాముడు: జెత్మలానీపై కేసుకు మల్కాజ్గిరి కోర్టుఆదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Jethmalani
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాంజెత్మలానీపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు పోలీసులను బుధవారం ఆదేశించింది. శ్రీరాముడు, లక్ష్మణుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ జెత్మలానీపై మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు ఈ రోజు రాంజెత్మలానీ పైన ఐపిసి 295, 295ఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా రాముడు మంచి భర్త కాదని, తాను అతనిని పూజించనని రాం జెత్మలానీ దాదాపు రెండు నెలల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన స్ర్తీ పురుష సంబంధాలపై రాసిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాముడు చెడ్డ భర్త అని, ఆయనను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాధించనని, ఎందుకంటే, ఎటువంటి కారణం లేకుండానే తన భార్య సీతను ఆయన అడవులకు పంపించేశాడన్నాడు.

ఎవరో ఏదో అన్నారనే చిన్న కారణంతో అమాయకురాలైన సీతను అడవులకు పంపేశాడని, రాముడి కంటే లక్ష్మణుడు మరింత చెడ్డవాడన్నారు. సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఆమెను వెతకాల్సిందిగా రాముడు కోరితే.... లక్ష్మణుడు అందుకు నిరాకరించాడన్నారు. ఆమె తనకు వదిన అని, తాను తల ఎత్తి ఎన్నడూ ఆమె ముఖాన్ని చూడలేదని, అందుకని ఆమెను తాను గుర్తించలేనని చెప్పాడన్నారు.

శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని రాం జెత్మలానీ ఆ తర్వాత చెప్పారు. రాముడిపై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకోబోనని ఆయన తెగేసి చెప్పారు. తానేమీ తప్పు చేయలేదన్నాుయ శ్రీరాముడంటే తనకు గిట్టదని, తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేది లేదన్నాడు.

English summary
Malkajgiri court of Hyderabad has ordered police to file case against senior lawyer Ram Jethmalani for his comments against lord Srirama and Laxmana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X