వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవిత మృతి: ఐర్లాండ్ సవరణపై కేథలిక్ చర్చి వ్యతిరేకత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Church urges Irish to oppose abortion law
డబ్లిన్: గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని ఐర్లాండ్ కేథలిక్ చర్చి అధిపతి పిలుపునిచ్చారు. కేథలిక్ చర్చి మతాధికారి సియాన్ బ్రాడీ తన క్రిస్మస్ సందేశంలో గర్భస్రవా చట్టాన్ని వ్యతిరేకించాలని దేశ ప్రజలకు సూచించారు. ఐరిష్ ప్రధాని ఎండా కెన్సీ మాట్లాడుతూ... అమాయక వ్యక్తి హక్కులను ఏ ప్రభుత్వం హరించరాదన్నారు. గర్భిణీ ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు గర్భస్రావాన్ని అనుమతించాలన్న చట్టాన్ని రూపొందించే ప్రయత్నంలో ఎండా ప్రభుత్వం ఉంది.

కాగా యూరోపియన్ యూనియన్‌లో ఒక్క ఐర్లాండ్‌లోనే గర్భస్రావంపై నిషేధం ఉంది. గర్భస్రావం చేసేందుకు ఇక్కడి వైద్యులు తిరస్కరించడంతో పిండం మృతి చెంది, రక్తం కలుషితం కావడంతో ఇటీవల సవిత అనే భారతీయ మహిళ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అబార్షన్ చేయకపోవడంతో సవిత మృతి చెందడం, ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్ పైన దిగొచ్చింది.

ఐర్లాండులో గర్భస్రావం చట్టాన్ని సవరిస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే గర్భస్రావం చేయవచ్చుననే సవరణకు అక్కడి ప్రభుత్వంలోని అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఒకే చెబుతున్నారు. అయితే దీనిని కేథలిక్ చర్చి మతాధికారి మాత్రం వ్యతిరేకించాలని పిలుపునివ్వడం గమనార్హం.

English summary
he head of Ireland's Catholic Church urged followers in his Christmas Day message to lobby against government plans to legalize abortion. Ireland, the only EU member state that currently outlaws the procedure, is preparing legislation that would allow limited access to abortion after the European Court of Human Rights criticized the current regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X