హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసులో 'టి' లొల్లి: సీమాంధ్ర నేతలకు విహెచ్ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy-V Hanumanth Rao
హైదరాబాద్: అఖిల పక్ష సమావేశం విషయంలో కాంగ్రెసు పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరిని బహిరంగంగా చెప్పకుండా 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో చెబుతామని ప్రతినిధులను ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే ఎందరం వెళ్లినా ఒకే నిర్ణయాన్ని చెబుతామని వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు చెబుతున్నాయి. బిజెపి, తెరాస, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా స్పష్టమన వైఖరితో అఖిల పక్ష సమావేశానికి వెళ్తున్నాయి.

అయితే కాంగ్రెసు పార్టీలో మాత్రం ఇంకా తెలంగాణ లొల్లి ఆగిపోలేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలు తామంటే తాము అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో అయినా అధిష్టానం ముందు అయినా తమది సమైక్య నినాదమే అని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తెలంగాణ నేతల ఒత్తిళ్లకు అధిష్టానం లొంగుతుందని తాము భావించడం లేదన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.

తెలంగాణవాదం వినిపించడంలో వెనుకంజ వేసేది లేదని ఆ ప్రాంత నేతలు మల్లు రవి, సురేష్ రెడ్డి చెబుతున్నారు. అఖిల పక్షంలో తెలంగాణ వాదం వినిపించే నేతలను పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉండాలని పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదం వినిపించే వారిని పంపించాలని ఆయన నాయకత్వాన్ని కోరారు.

కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 16 పార్లమెంటు స్థానాలను గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచితే ఎన్ని సీట్లు గెలిపిస్తారో సీమాంధ్ర నేతలు చెప్పాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీకి కష్టకాలం ఖాయమన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ధర్మాన ప్రసాద రావు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఓ న్యాయం ధర్మానకు ఓ న్యాయమా అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెసు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ ఇస్తే కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెబుతున్నారని, సమైక్యాంధ్ర ుఉంటే జగన్ కలిపేస్తారా చెప్పాలన్నారు.

English summary
Congress Party senior leader V Hanumanth Rao has demanded central government to Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X