వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4న బిజెపి జాతకం తేల్చేస్తా: షెట్టార్‌పై యడ్యూరప్పఫైట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం యడ్డీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంతకుముందు ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదిన జగదీష్ శెట్టార్ ప్రభుత్వం జాతకాన్ని తేల్చేస్తానని హెచ్చరించారు.

శెట్టార్ ప్రభుత్వం మెజార్టీని కోల్పోయిందని అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని తనంతట తానుగా శెట్టార్ గ్రహించాలని సూచించారు. లేకుంటే తామే స్వయంగా గవర్నర్‌ను కలిసి సర్కారుకు మద్దతు లేదని వివరిస్తామని చెప్పారు. వచ్చే నెల 4న గవర్నర్‌ను కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతకాన్ని తేల్చేస్తామని ఆయన చెప్పారు.

శెట్టార్ పాలన సిగ్గు చేటు అని ఆయన కుంభకర్ణునిలా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఏడాది తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి పేదవర్గాలను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని అందుకు ఆ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అన్నారు. తాను ప్రవేశపెట్టిన భాగ్యలక్ష్మి, సంధ్యా సురక్ష, వృద్ధులకు పింఛన్ వంటి పలు పథకాలను బిజెపి నీరుగారుస్తోందని ఆయన ఆరోపించారు.

English summary

 2013 does not seems to augur well for Karnataka Chief Minister Jagadish Shettar. Now-a-days, Shettar's former friend and BJP colleague BS Yeddyurappa is baying for his blood. In his continuous attack against the Chief Minister, the 70-year-old Yeddyurappa has stooped to name calling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X