వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కిరణ్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Asaduddin Owaisi
న్యూఢిల్లీ: తెలంగాణపై శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఒవైసీ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. ఒక సందర్భంలో నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. చివరకు ఈ సమావేశానికి నేతృత్వం వహించిన కేంద్ర హోంమంత్రి షిండే స్వయంగా జోక్యం చేసుకుని సర్ది చెప్పారు.

"రాష్ట్రంలో ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే మా వైఖరి. ఒకవేళ విభజించాల్సి వస్తే హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినా, రక్షణ రాజధానిగా మార్చినా మేం అంగీకరించే ప్రసక్తి లేదు" అని ఓవైసీ అన్నారు.

దాంతో ఆగకుడా - ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని, రాష్ట్రంలో ముస్లింలపై దాడులు అధికమయ్యాయని, భాగ్యలక్ష్మి ఆలయ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని, సంఘ్ పరివార్‌తో కుమ్మక్కై ముఖ్యమంత్రి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించారని అని ఆయన అనడంతో కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.

"ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? మీరేమి మాట్లాడుతున్నారు? ఆ విషయాలు మాట్లాడుకునేందుకు ఇది వేదికా? ఈ సమావేశంలో మాట్లాడాల్సిన అంశమా అది?" అని ముఖ్యమంత్రి ఓవైసీని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ - ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తనకు తెలుసునని, తాను తన అభిప్రాయం చెబుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని, తానేం మాట్లాడాలో మీరు చెబుతారా, ముఖ్యమంత్రి లాగా తనకు మేధోపరమైన నిజాయితీలోపం లేదని ఓవైసీ అన్నారు.

ఆ తర్వాత నిజాయితీలోపం ఎవరనేదే విషయంపై ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఆ సమయంలో షిండే జోక్యం చేసుకున్నారు. దాంతో ఓవైసీ తాను చెప్పాల్సిన విషయం చెప్పారు.

English summary
War of words has been taken place between CM Kiran Kumar Reddy and MIM chief Asaduddin Owaisi in all party meeting held on Telangana issue under the president ship of the union home minister Sushil kumar Shinde.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X