చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్లక్ష్యం: తెలుగు మహాసభలపై రోశయ్య అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
చెన్నై: తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం మీద అన్ని వైపుల నుంచీ విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం చూస్తుంటే నిర్వహణా లోపమే కాదు, బాధ్యతా రాహిత్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తన పట్ల వహించిన నిర్లక్ష్యానికి తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభలకు వెళ్లరాదని రోశయ్య నిర్ణయించుకున్నారు.

మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన లేఖ మేరకు 29న తిరుపతి వెళ్లాలని రోశయ్య ముందుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా పంపారు. కానీ, శుక్రవారం రాత్రి వరకూ ఆయన్ను మళ్లీ ఎవరూ సంప్రదించకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా నిర్వాహకులు ఆదిలో ఆహ్వానపత్రం అందించారు. తరువాత సమాచారం లేకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని ఆమె నిర్ణయించుకున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.

సభల నిర్వహణ తీరు కూడా అంతే గందరగోళంగా ఉంది. అంతా అయోయంగా ఉందని అక్కడికి వెళ్లినవారు అంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా సమాచారం అందించలేని స్థితి నెలకొని ఉంది. సినీ ప్రముఖులకు సన్మానం చేసి, వారిని వేదికపై కూర్చోబెట్టిన నిర్వాహకులు రచయితలకు సన్మానం చేసి వారిని వేదికపై నుంచి దించేశారు. తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ గురించి మాట్లాడేవారు రచయితలకు ఇలాంటి అవమానం చేయడం ఏమిటని అంటున్నారు.

English summary
Tamilnadu governor and former CM of Andhra Pradesh K rosaiah was unhappy with the World Telugu Conference organizes. He has decided to keep away from the conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X