అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారణాయుధాలతో చమన్ అనుచరుల అరెస్ట్: ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chaman
అనంతపురం: దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు చమన్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెసు పార్టీ నేత కామిరెడ్డిపల్లె సుధాకర్ రెడ్డి హత్యకు వారు కుట్ర పన్నారని ఆరోపణలు వస్తున్నాయి. వారి కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

మొత్తం నలుగురి నుండి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మారణాయుధాలతో ఉన్న వారిని అనంతపురం జిల్లా రామగిరి మండలం, ఎన్ఎస్ గేటు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పిస్టల్, కత్తి, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వారితో నాకు సంబంధం లేదు

పోలీసులు అరెస్టు చేసిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని చమన్ చెప్పారు. మారణాయుధాలతో పట్టుబడ్డ వాళ్లలో శ్రీను అనే వ్యక్తి తన వద్ద డ్రైవర్‌గా పని చేసి పదేళ్ల క్రితం మానేశాడని చెప్పారు. మిగిలిన వారితోనూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎవరి పైనా ఎటువంటి కుట్రకు పాల్పడటం లేదన్నారు.

తన పేరుతో ఏవరైనా ఇలాంటివి చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. పట్టుబడ్డ వాళ్లు తన అనుచరులు ఎంతమాత్రం కాదన్నారు. జిల్లాకు రావొద్దని పోలీసులు తనపై ఆంక్షలు విధించారని, అప్పటి నుండి రావడం లేదన్నారు. తాను కేవలం తన బంధువులు, కుటుంబ సభ్యులను మాత్రమే కలుస్తున్నానని చెప్పారు. నెలలుగా తాను అనంతకు వెళ్లడం లేదన్నారు.

తనను అనంతకు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తనపై ఇలాంటి కుట్ర ఎవరు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. దానిపై స్పష్టత లేదని చెప్పారు. తన పార్టీ వాళ్లు ఎవరైనా ఉంటే పార్టీ అధినేతకు తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

English summary
Four men arrested in Anantapur district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X