వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది అసలురూపం: బాబుపై ఈటెల, రాళ్లతోదాడి: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
కరీంనగర్/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం మరోసారి బయట పడిందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ సోమవారం అన్నారు. వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నిన్న వరంగల్‌లో జై తెలంగాణ అని రాసి ఉన్న బోనాన్ని పక్కన పెట్టి జై తెలుగుదేశం అని రాసి ఉన్న బోనాన్ని ఎత్తుకొని తన వైఖరిని బట్టబయలు చేశారన్నారు.

తెలంగాణ కోసం వెయ్యి మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు ఒక్కరిని కూడా పరామర్శించలేదని విమర్శించారు. అలాంటి చంద్రబాబును తెలంగాణవాదులు ఎవరూ నమ్మరన్నారు. నెల రోజుల్లో కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల నుండి డబ్బులు తీసుకొని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోటరీ తెలంగాణను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.

ఇటుకలతో కొడితే రాళ్లతో కొడుతాం

కృష్ణా జిల్లా విజయవాడలో తొర్రూరు డిపో బస్సు పైన దాడి చేయం సరికాదని సిద్దిపేట తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాదులో అన్నారు. బస్సులపై సీమాంధ్రులు ఇటుకలతో దాడి చేస్తే తాము రాళ్లతో కొడతామని హెచ్చరించారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ల పైన దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

టిడిపి నర్సారావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రకటనతో తెలంగాణపై టిడిపి నిజ స్వరూపం బయటపడిందన్నారు. టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉన్నదే నిజమైతే వేణుగోపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. లేదంటే ఆ పార్టీని సమైక్యవాద పార్టీగానే గుర్తిస్తామన్నారు.

English summary
TRSLP Etela Rejender has blamed Telugudesam Party 
 
 chief Nara Chandrababu Naidu his real face was 
 
 revealed in Warangal tour on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X