హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిత్రుడింట్లో యువతి మృతి: వేధింపులు అన్న దృష్టికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Friend kills young girl
హైదరాబాద్: న్యూఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా... రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతి అనుమానాస్పద మృతి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచార యత్నం చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. నగరంలోని ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ ప్రాంతంలో ఇది జరిగింది. ఓ యువతి మృతదేహం సోమవారం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

హత్యగావింపబడ్డ యువతి యూజిసి నెట్ పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చింది. ఆమె తన స్నేహితుడు శివకుమార్ ఇంట్లో సోమవారం విగత జీవిగా కనిపించింది. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లుగా సమాచారం. శివకుమారే ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాప్ చేసి పెట్టాడు.

శివకుమార్‌తో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉస్మానియాలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు ఉస్మానియి విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. శివకుమార్ కూడా ఉస్మానియా నుండి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. కాగా విద్యార్థిని హత్యను నిరసిస్తూ, నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా విద్యార్థులు ఛత్రినాక, అఫ్జల్‌గంజ్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో పాతబస్తీలో ట్రాఫిక్ జాం అయింది.

వేధింపులు అన్న దృష్టికి తెచ్చిన మృతురాలు

తనను కొద్దికాలంగా శివకుమార్ అనే విద్యార్థి వేధిస్తున్నట్లుగా తన దృష్టికి తన చెల్లి తీసుకు వచ్చిందని మృతురాలు సోదరుడు చెప్పారు.

కాగా ఓయు విద్యార్థి అరుణ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా ఉస్మానియా విద్యార్థులు న్యాయం జరిగే వరకు కదలనిచ్చేది లేదని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

English summary
A 22-year-old woman, was found dead at her friend's house in Chatrinaka under suspcious circumstances on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X