హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ రిమాండ్ 14 రోజులు పొడగింపు, వీడియో విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక కోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. నిరుడు మే 27వ తేదీన అరెస్టయిన వైయస్ జగన్ ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, సీనియర్ అధికారి బ్రహ్మానంద రెడ్డి కూడా ఇదే జైలులో ఉన్నారు.

జగన్‌తో పాటు ఇతర నిందితులను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం వారి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు 14 రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు ఇంతకు ముందు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 4వ తేదీన విచారణకు రానుంది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసు నిందితులను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, వారి రిమాండ్‌ను కూడా ఈ నెల 17వ తేదీ వరకు పొడగించింది. ఒఎంసి కేసులో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మాజీ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్ జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు పొడగించింది.

అంతకు ముందు, ఒఎంసి కేసులో సిబిఐ అలీఖాన్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో కూడా సునీల్ రెడ్డి తదితర నిందితుల జ్యుడిషియల్ రిమాండ్‌ను జనవరి 17వ తేదీ వరకు పొడగించింది.

English summary
A special CBI court at Nampally on Wednesday extended till January 17 the judicial remand of YSR Congress chief YS Jagan and other accused in connection with the alleged disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X