హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో చేరను, తెలంగాణ తేలుతుంది: ముఖేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud
హైదరాబాద్: తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ముఖేష్ గౌడ్ బుధవారం ఖండించారు. తాను కాంగ్రెసు పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడే ప్రసక్తి లేదన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి అయినా ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను జగన్ పార్టీలో చేరేది లేదన్నారు.

విభజన అనివార్యమైతే తమ డిమాండ్లు తమకు ఉన్నాయన్నారు. విభజన లేకుంటే సమైక్యంగానే ఉంటుందన్నారు. విభజన జరిగితే మాత్రం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఊరుకునే సమస్య లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే తమ డిమాండ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాదుకు ప్రత్యేక రక్షణ నియమావళి కావాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఉన్న ప్రజల హక్కులను కాపాడాలన్నారు.

ఎల్లుండి జరగబోయే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశం పైన తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. పాతబస్తీకే పరిమితమై ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెసు వల్లే ఎదిగిందని చెప్పారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని తాను విశ్వషిస్తున్నానని చెప్పారు. ఇలాగే చేస్తుందని తాను చెప్పలేనని, అయితే నెల రోజుల్లో ఓ ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని మాత్రం చెప్పగలనన్నారు.

నల్గొండ నేతలకు బొత్స సూచన

నల్గొండ జిల్లా నేతలు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వివాదంపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వేరుగా స్పందించారు. వారిద్దరితో తాను మాట్లాడతానని చెప్పారు. ఇంతటితో ఈ వివాదానికి వారు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Minister Mukesh Goud said on Wednesday that he will not join in YS Jaganmohan Reddy's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X