రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగని దురాగతాలు: 40 రోజుల్లో 42 మందికి బలైన గర్ల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Minor Girl molested in Rajahmundry
బెంగళూరు/శ్రీనగర్/రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాలుగేళ్ల బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. డిసెంబర్ 29వ తేదిన ఆమెపై ఇద్దరు యువకులు గ్యాంగ్ రేప్‌కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలి తల్లిదండ్రులు అక్కడకు బ్రతుకు దెరువు కోసం వచ్చారు. డిసెంబర్ 29 మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఇద్దరు యువకులు బాధిత బాలికను ఓ షెడ్డు వద్దకు తీసుకు వెళ్లారు.

అక్కడ ఇద్దరు ఆమెపై రేప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామ అధికారికి తెలియజేశారు. అతను తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుంటారు. ఇద్దరు ఇప్పటికే పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కాశ్మీరులో..

కాశ్మీరులోని రాజౌరి జిల్లాలో ఓ వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నౌషెరా ప్రాంతానికి చెందిన ఆమె ఇటీవల నీళ్ల కోసం వెళ్లినప్పుడు మదన్ లాల్, అసారాం, రఫీక్ అనే స్థానికులు ఓ ఖాళీ షాపులోకి లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో...

దేవరాజీవన్హళ్లిలో సోమవారం ఏడేళ్ల మైనర్ బాలికకు ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి అత్యాచారం చేశాడు. నగరంలోని మచనాయకనహళ్లిలో పదిహేడేళ్ల మానసిక వికలాంగురాలిపై లారీ డ్రైవర్ అయిన అతను అత్యాచారానికి ఒడిగట్టాడు.

వేధింపులతో యువతి మృతి

మహారాష్ట్రోలని అకోలాలో చంద్రకాంత్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఫోన్ చేస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తుండటంతో 20 ఏళ్ల యువతి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

16 ఏళ్ల తర్వాత...

40 రోజుల్లో 42 మంది కామాందులు ఓ పదహారేళ్ల యువతిని కాటేశారు. ఆ ఘోరం జరిగి పదహారేళ్లవుతోంది. అయితే ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. 1996 జనవరి 16న కేరళలోని ఉడుక్కి జిల్లా సూర్యవనెల్లికి చెందిన 16 ఏళ్ల బాలికను ఓ బస్సు కండక్టర్ కిడ్నాప్ చేశాడు. అత్యాచారం చేసి ఇద్దరికి అప్పగించాడు. ఆమె 40 రోజుల్లో 42 మంది బారిన పడింది. ఆమె జీవచ్ఛవంలా పడి ఉంది.

కేసు విచారణ కోసం కేరళ ప్రభుత్వం 2000లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది. 35 మందిని దోషులుగా తేల్చి జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టు మూడేళ్ల తర్వాత ఆ తీర్పును కొట్టేసి ఒకరిని దోషిగా నిర్ధారించింది. హైకోర్టు తీర్పును 2005లో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఇంకా విచారణ ప్రారంభించలేదు.

English summary
A four year old girl was allegedly gang raped by two youths at Konthamuru village of Rajanagaram mandal near Rajahmundry on December 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X