వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణతో ఆ డిమాండ్లకు లింక్ లేదు: రషీద్ అల్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rashid Alvi
న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లతో తెలంగాణ అంశానికి సంబంధం లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. తెలంగాణను చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లకు ముడిపెట్టవద్దని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై తాము దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పేదే కాంగ్రెసు విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో దీన్ని ముడిపెట్టలేమని ఆయన అన్నారు. మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే తమ భవిష్యత్తు కార్యాచరణ ముడిపడి ఉందని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం చెన్నైలో అన్నారు. రాష్ట్ర విభజనపై తమ కాంగ్రెసు పార్టీలో ఎవరి వాదన వారిదేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 30 రోజుల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ప్యాకేజీలతో సరిపుచ్చి కేంద్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు విమర్శించారు. ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే కేంద్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పు పట్టారు.

English summary
AICC spokesperson Rashid Alvi said that there was no link between Telangana issue and smaller states demands. He said that home minister Sushil kumar words are Congress stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X