వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఐసి కొత్త సంవత్సరం జంట ప్రొడక్టుల ఆఫర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Twin Product offer from LIC
ముంబై: నూతన సంవత్సరం కానుకగా భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసి) జంట ప్రొడక్టులను అందుబాటులోకి తెచ్చింది. డిఫర్డ్ పెన్షన్ ప్లాన్ న్యూ జీవన్ నిధిని, ఫ్లెక్సీ ప్లస్ ఎనే రెండు యూనిట్ అనుసంధాన హామీ ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఎల్ఐసి న్యూ జీవన నిధి సంప్రదాయబద్దమైన ప్రాఫిట్ పెన్షన్ ప్లాన్. మొదటి ఐదేళ్లకు ప్రతి వేయి రూపాయలకు 50 రూపాయల చొప్పున గ్యారంటీతో కూడిన అదనాన్ని హామీ ఇస్తుంది. ఆరో ఏడాది నుంచి బోనస్ రూపంలో లాభంలో భాగం ఉంటుంది.

20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వ్యక్తులు దీనికి అర్హులు. పాలసీ కాలవ్యవధి 5 నుంచి 35 ఏళ్ల వరకు ఉంది. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ సౌకర్యం కూడా ఉంది. ఈ పాలసీతో చాలా లాభాలున్నాయి. ఒక వేళ తొలి ఐదేళ్లలో పాలసీదారు మరణిస్తే హామీ ప్రాథమిక సొమ్ముతో పాటు పోగు పడిన గ్యారంటీ అడిషన్ ఏకమొత్తంగా లేదా ఏకమొత్తంలో అన్యూటీ రూపంలో గానీ నామినీకి చెల్లించడం జరుగుతుంది. మిగతా మొత్తాన్ని తక్షణ అన్యూటీ రేట్ల ప్రకారం చెల్లిస్తారు.

పాలసీదారు ఐదేళ్ల తర్వాత మరణిస్తే హామీ ఇచ్చిన ప్రాథమిక సొమ్ముతో పాటు పోగు పడిన హామీ అదనాన్ని ఏకమొత్తంగా గానీ లేదా ఏకమొత్తంలో అన్యూటీని రూపంలో గానీ చెల్లించడం జరుగుతుంది. ఏవైనా ఉంటే సింపుల్ రివర్సనరీ బోనస్‌లు, అదనపు బోనస్‌తో పాటు వాటి చెల్లింపు ఉంటుంది. మిగతా మొత్తాన్ని తక్షణ అన్యూటీ రేట్ల ప్రకారం చెల్లిస్తారు.

వెస్టింగ్ సౌకర్యం ఆకర్షణీయంగా ఉంది. హామీ ఇచ్చిన ప్రాథమిక సొమ్ముతో పాటు పోగు పడిన హామీ అదనాన్ని చెల్లించడం జరుగుతుంది. ఏవైనా ఉంటే సింపుల్ రివర్సనరీ బోనస్‌లు, అదనపు బోనస్‌తో పాటు వాటి చెల్లింపు ఉంటుంది. దీన్ని పాలసీదారు తక్షణమే అన్యూటీ కొనుగోలు ద్వారా పొందవచ్చు. ఎల్ఐసి నుంచి కొత్త సింగిల్ ప్రీమియం డిఫర్ట్ ఫెన్షన్ ప్రొడక్టును కొనుగోలు చేయవచ్చు.

ఇక ఎల్ఐసి ఫ్లెక్సీ ప్లస్ యూనిట్ అనుసంధాన పాలసీ. ఈ పాలసీలో ఏకమొత్తం ప్రయోజనాన్ని చేకూర్చడంతో పాటు పాలసీదారు మనుగడతో సంబంధంతో లేకుండా మాచ్యురిటీ బెనిఫిట్‌ను అందిస్తుంది. పాలసీదారు తాను చెల్లించే ప్రీమియం సొమ్మును నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లోయర్ నుంచి మీడియం రిస్క్‌తో నిలకడైనా ఆదాయాన్ని అందించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పాలసీ టర్మ్‌ను, చెల్లింపు పద్ధతిని, ఫండ్ టైప్‌ను ఇందులో ఎంపిక చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. పాక్షికంగా వెనక్కి తీసుకుని ఫండ్ టైప్‌ను స్విచ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పాలసీదారు డెబిట్ ఫండ్‌ను గానీ మిక్స్‌డ్‌ ఫండ్‌ను గానీ ఎంపిక చేసుకోవచ్చు.

Eligibility conditions and other restrictions in LIC Jeevan Nidhi Plan
Description Minimum Maximum
Sum Assured (in Rs.) 50,000 No Limit
Policy Term (in years) 5 for Regular Premium
6 for Single Premium
35 Years
Entry Age of Policyholder (in years) 18 Years 65 Years
Age at Vesting (in years) 40 Years 75 Years
Premium (in Rs.) 10,000 for Single
3000 for Regular
No Limit
Payment modes Single, Yearly, Half-yearly, Quarterly, Monthly and SSS


Sample illustration of LIC Jeevan Nidhi Plan:

The below illustration is for a healthy Male of 35 years (non-tobacco user) opting for a Annual Premium = Rs. 4121 and Policy Term = 25 years respectively.

Guaranteed Maturity Benefit = Rs 1,00,000 (Sum Assured) + Rs 5000 guaranteed addition in the first 5 years

Other pension plans from Life Insurance Corporation of India:

* LIC Pension Plus - ULIP

* LIC New Jeevan Suraksha 1

* LIC New Jeevan Dhara 1

* LIC Jeevan Akshay 6

తెలుగు వన్ఇండియా

English summary
Life Insurance Corporation of India (LIC) was launching two products New Jeevan Nidhi and Flexi Plus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X