ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సహకారం' చిక్కు: వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balineni Srinivas Reddy
ఒంగోలు: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. ఒంగోలు సహకార ఎన్నికల సంఘం అధికారి విధులను అడ్డుకొని దౌర్జన్యం చేశారనే అభియోగాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పైన ఒంగోలు టూటౌన్ పోలీసులు గురువారం కేసును నమోదు చేశారు.

సహకార ఓటర్లలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం అధికారి కొండయ్యను అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. బాలినేనితో పాటు మరి కొందరు ఈ ఘటనలో ఉన్నారు.

దీంతో బాలినేనితో పాటు మరో ఇరవై మంది పైన పోలీసు కేసు నమోదయింది. ఈ రోజు ఉదయం కొండయ్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసు నమోదయింది.

కాగా రెండు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరంగా ఉన్నారు. అదే రోజు పార్టీ అధినేత వైయస్ జగన్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జగన్ కోసం - కోటి జనం సంతకాల కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు.

English summary
Police were book a case against YSR Congress Party Ongole MLA Balineni Srinivas Reddy on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X