• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అలీయే బినామీ, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు: సిబిఐ

By Srinivas
|

Mehfuz Khan - Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఆయన సహాయకుడు అలీ ఖాన్ బినామీ అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తెలిపింది. సిబిఐ బుధవారం ఓఎంసి కేసులో అనుబంధ ఛార్జీషీటును కోర్టుకు దాఖలు చేసింది. అందులో పలు విషయాలని సిబిఐ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఓఎంసి కేసులో తవ్వి తీయాల్సింది ఇంకా చాలా ఉందని సిబిఐ తెలిపింది. అక్రమ తవ్వకాల్లో గాలి, అలీ ఖాన్ పాత్ర కీలకమని పేర్కొంది.

గాలి సూచనల మేరకే అలీ ఖాన్ ముడి ఇనుము విక్రయాలు చేశారని, అందుకు అనుగుణంగా కొందరు అధికారులతో లాలూచీ వ్యవహారాలు నడిపించారని తెలిపింది. వీరితోపాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేయాలని పేర్కొంది. అలీఖాన్‌ను ఓఎంసి కేసులో రిమాండ్‌కు తరలించిన 90వ రోజున సిబిఐ అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఓఎంసి కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని తెలిపింది.

అలీ ఖాన్ ప్రారంభించిన మైనింగ్ కంపెనీ దేవీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా విక్రయించిన ముడి ఇనుము గురించి, ఆ సంస్థ ఇతర మైనింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అమ్మిన ఖనిజం గురించి కోర్టుకు కొన్ని వివరాలు అందించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఇనుప ఖనిజాన్ని ఓఎంసి నుంచి కొని, ఆ సంస్థకు చెల్లించిన నగదు వివరాలను రాబట్టాల్సి ఉందని సిబిఐ పేర్కొంది. దీనికోసం బళ్లారిలో ఓఎంసికి చెందిన బ్యాంకు ఖాతాలపై దృష్టిపెట్టామని... ఆయా బ్యాంకు శాఖ మేనేజర్లను ప్రశ్నించాలని తెలిపింది.

బ్యాంకు మేనేజర్లు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలిపి మొత్తం 36 మందిని సాక్షులుగా చూపింది. 47 పేజీల చార్జ్‌షీట్‌తో 67 డ్యాకుమెంట్లు, సుమారు 3 వేల అనుబంధ పత్రాలను నాంపల్లి సిబిఐ కోర్టుకు అధికారులు సమర్పించారు. తాము ఆ కంప్యూటర్‌ను సేకరించి, అందులోని సమాచారాన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ద్వారా తిరిగి రాబట్టగలిగామని చార్జ్‌షీట్‌లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

ఈ కేసులో రెండో నిందితుడిగా ఎ2 గాలి జనార్దన్‌రెడ్డి, ఎ7 అలీఖాన్ పాత్ర కీలకమని... ఆ వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలీ ఖాన్ పాత్రకు సంబంధించి ఇదే ఆఖరు చార్జ్‌షీట్ అని చెప్పలేమంది. ఇనుప ఖనిజం విక్రయించగా వచ్చిన సొమ్ము అంతిమంగా ఎక్కడకు చేరిందో తెలియాల్సి ఉందని నివేదించారు. ఓఎంసి పేరుతో తవ్విన ముడి ఇనుమును ఎక్కడికి తరలించారో అలీ ఖాన్‌కు తెలుసని, అంతకుముందు ఆయన కొన్ని మైనింగ్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి, తమకే ముడి ఇనుము అమ్మాలని డిమాండ్ చేశారని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

అలా ఆయన నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న వారిని సిబిఐ సాక్షులుగా చూపినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను వెల్లడించే ముందు ఈ కేసులో అలీ ఖాన్ పాత్ర ఎంత ముఖ్యమైనదో సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు. ఓఎంసిలో ద్వారా ఆర్జించిన సొమ్మును అలీ ఖాన్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా మార్చారని తెలిపినట్లుగా సమాచారం. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రూ.50 కోట్లతో 200 ఎకరాలు కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని, ఆదాయపు పన్ను శాఖకు రూ.68 కోట్ల ఆదాయాన్ని చూపారని, దీనికి సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందని పేర్కొంది.

English summary
The CBI on Wednesday filed a charge sheet against K Mehfuz Ali Khan, an accused in the Obulapuram Mining Company (OMC) scam involving jailed former Karnataka minister Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X