• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ ఒత్తిడి: నేతల భేటీ, డికె అరుణ సొంత అజెండా

By Srinivas
|

DK Aruna
హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 28న అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రంలోని వివిధ పార్టీలు తెలంగాణపై తమ తమ అభిప్రాయాల్ని చెప్పాయి. ఇప్పుడు తెలంగాణ సమస్య పరిష్కారం కాంగ్రెసు చేతిలోనే ఉంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అఖిల పక్ష సమావేశం అనంతరం మాట్లాడుతూ.. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే విభజన జరగదని, అయితే తెలంగాణ సమస్యను మాత్రం కేంద్రం పరిష్కరిస్తుందని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు చెబుతున్నారు.

దీంతో తెలంగాణ కాంగ్రెసు నేతల్లో ఆందోళన ప్రారంభమైంది. షిండే చెప్పినట్లుగా అలాగే మూడేళ్ల క్రితం 9 డిసెంబర్ 2009లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లో తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం, కేంద్రం నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెసు నేతలు శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలువురు నేతలు సమావేశ స్థలికి చేరుకున్నారు.

నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామి షిండే చెప్పినందు వల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా అధిష్టానంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలనే అంశాన్ని ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. హాజరు కానున్నారు. మంత్రుల్లో ఎందరు హాజరవుతారనే అంశంపై స్పష్టత లేదు. నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు హాజరు కావడం లేదు.

వారికి ఆహ్వానాలు కూడా అందలేదు. దీంతో హాజరయ్యేందుకు వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ కూడా గైర్హాజరవుతున్నారు. ఆమె తన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ జరిగే సమయానికి డికె అరుణ తన వర్గం నేతలతో మరో సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి కూడా భేటీకి దూరంగా ఉండనున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ministers DK Aruna, Danam Nagender, Mukesh Goud and Ramreddy Venkat Reddy will not attend to Telangana Congress leaders meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more