వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కి బెయిల్ రావాలి, ఏం జరిగినా: డిఎల్ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుకుంటున్నట్లు మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు స్నేహితుడు అని చెప్పారు. జగన్ తన స్నేహితుడి కొడుకు కాబట్టి ఆయనకు బెయిల్ రావాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు.

జగన్ కోసం కోటి సంతకాలపై స్పందిస్తూ... కోటి సంతకాలు చేయిస్తే జగన్ బయటకు వస్తారా అని ప్రశ్నించారు. కోటి సంతకాలతో జగన్ బయటకు వచ్చినట్లయితే తమ మంత్రులు రెండు కోట్ల సంతకాలు చేయిస్తారన్నారు. సంతకాలతో బయటకు వచ్చేస్తే ఇప్పటి వరకు ఎందరో గ్యాంగ్ స్టర్లు వచ్చేవారన్నారు.

తాను కాంగ్రెసు పార్టీలోనే ఎప్పుడూ ఉంటానని చెప్పారు. పార్టీలో తనకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వీడే ప్రసక్తి లేదన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను కాంగ్రెసు పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. కాగా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో డిఎల్ రవీంద్రా రెడ్డికి పొసగడం లేదనే విషయం తెలిసిందే. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కిరణ్ పైన డిఎల్ నిప్పులు చెరుగుతున్నారు.

గత డిసెంబర్లో కూడా ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. మంత్రి పదవి తనకు చాలా అసౌకర్యంగా ఉందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులు సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్న నేపథ్యంలో వారుకి అధికారం లేదన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు నిర్దోషి అని మంత్రివర్గం చర్చించడమేమిటని ప్రశ్నించారు.

తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ వైరం లేదని అయితే తప్పుడు నిర్ణయాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ధర్మాన ప్రసాద రావును సిబిఐ విచారణకు ఆమోదించవద్దన్న కేబినెట్ నిర్ణయం వెనుక మోటివేషన్ ఉన్నట్లుగా కనిపిస్తోందని డిఎల్ రవీంద్రా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాన రాజీనామా, సిబిఐ విచారణ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నారు.

వాటిని మంత్రులపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి అంత సౌకర్యంగా లేదన్నారు. ప్రభుత్వం తీరు చూస్తే తనకు సిగ్గేస్తోందన్నారు. ధర్మాన ప్రసాద రావు పైన తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కోర్టుకు వెళ్తే మంత్రులకు కష్టాలు తప్పవన్నారు. కిరణ్‌తో మొదట పథకాల విషయంపై అసంతృప్తితో విభేదాలు ప్రారంభమయ్యాయి. మంత్రుల కేసు విషయంతో అవి తారాస్థాయికి చేరుకున్నాయి.

English summary
Minister DL Ravindra Reddy said on Friday that he will not leave Congress party till his lost breath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X