ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం ఆరోపణలు: చిక్కుల్లో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramreddy Venkat Reddy
హైదరాబాద్: లంచం ఆరోపణలు రావడంతో రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పీకలలోతు కష్టాల్లో పడ్డారు. మంత్రికి 35 లక్షల రూపాయలు ముట్టజెప్పామని ఖమ్మం జిల్లా ఎన్కూరులోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం హైకోర్టుకు ఎక్కింది. ఇతర అధికారులు 15 లక్షల రూపాయలు తీసుకున్నారని స్కూలు యాజమాన్యం ఆరోపించింది. శ్రీచైతన్య టెక్నో స్కూల్ కరస్పాండెంట్ గుగులోత్ చిన్నా, ప్రధానోపాధ్యాయుడు వి. రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి విచారణ చేపట్టారు.

ముడుపులు ఇచ్చినందుకు పిటిషనర్లపై కూడా చర్యలు ఉంటాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపించారు.ట విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. స్కూలును డిసెంబర్ 31వ తేదీ నుంచి మూసేయాలని డిఇవో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ వేశారు.

మంత్రికి, ఇతర అధికారులకు ఇచ్చిన 50 లక్షల రూపాయలను తమకు తిరిగి ఇప్పించాలని, మంత్రి ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని, ఇతర అధికారులపై ఎసిబి దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.

కాగా, శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం ఆరోపణలను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. శ్రీచైతన్య టెక్నో స్కూల్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఎవరి వద్ద కూడా తాను డబ్బులు తీసుకోలేదని ఆయన శనివారంనాడు అన్నారు. తనపై కేసు వేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. కేసు వేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.

English summary
Minister Ramreddy Venkat Reddy is in deep trouble, as Sri Chaitanya Techno School in Khammam District management has filed petition in the High Court, alleging the former has taken bribe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X