వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలికి నో: కోదండరామ్, మోకాళ్లపై...: బాబుపై ఈటెల

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram - Etela Rajendar
మహబూబ్‌నగర్/ కరీంనగర్‌: తెలంగాణకు మండలిని, ప్యాకేజీలను అంగీకరించేది లేదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. వాటి వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరబోవని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణపై నిర్ణయం వస్తే ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణకు స్వయంపాలన, ఆత్మగౌరవం కావాలని ఆయన అన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తమకు కావాలని అన్నారు. ఈ నెల 21వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చకపోతే అగ్నిగుండమే అవుతుందని సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇంకా జాప్యం చేస్తే కాంగ్రెసు పార్టీకి నూకలు చెల్లినట్లేనని ఆయన శనివారం కరీంనగర్‌లో అన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్కు వద్ద సిపిఐ సామూహిక ధర్నా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 22వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేలాది కిలోమీటర్లు మోకాళ్లపై నడిచినా తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో శనివారం అన్నారు. చంద్రబాబు విలువలు, నీతిలేని రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమిస్తున్న తమపై పార్టీని చంద్రబాబు విమర్శించడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే రాష్ట్రంలో అధ్వాన పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు.

English summary

 Telangana political JAC Kodandaram has said that they will not accept packages or council for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X