వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి పార్టీ సైనికుడు, త్వరలో శుభవార్త: సర్వే

By Pratap
|
Google Oneindia TeluguNews

urvey Satyanarayana
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు పార్టీ సైనికుడని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. లగడపాటి ఉంటే కాంగ్రెసు పార్టీలో ఉంటారని, లేదంటే రాజకీయాలను వదిలేస్తారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లగడపాటి పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దానిపై సర్వే సత్యనారాయణ ఆ విధంగా అన్నారు.

తెలంగాణ ఇస్తారా, చస్తారా అని పదే పదే అంటే ఇవ్వబోమనే అంటారని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తెలంగాణ విషయంలో త్వరలో శుభవార్త వింటారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. అందరి సహకారంతో తెలంగాణ ఇచ్చే దాకా వేచి ఉండాలని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానం ప్రతిని అధిష్టానం పెద్దలకు అందించడానికి ఢిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కట్టారు. ఆయన శనివారం ఉదయం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.

కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన గులాం నబీ అజాద్‌తో పాటు పలువురిని కలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆయన కలుసుకోవాలని భావించారు. అయితే, వారి అపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదు.

కాగా, ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగిన సమైక్యాంధ్ర సదస్సుకు కాంగ్రెసు అసంతృప్త పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి హాజరయ్యారు. గత రెండు రోజులుగా కాంగ్రెసు అధిష్టానం కోర్ కమిటీ సమావేశమై తెలంగాణపై చర్చించింది. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించే ఉద్దేశంతోనే కాంగ్రెసు ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
The union minister from Telangana Survey Satyanarayana has said that Vihayawada MP Lagasapati Rajagopal is a soldier of Congress and he will leave Congress party 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X