వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి నన్నూ పిలిచారు: వట్టి వసంత కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
ఏలూరు: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తననూ వారిపార్టీలోకి రమ్మని ఆహ్వానించారని మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. శుక్రవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆహ్వానానికి తాను గట్టిగానే సమాధానం ఇచ్చానని చెప్పారు. తాను విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్‌లోనే ఎదిగానని, ఇంతటి వాణ్ని చేసిన కాంగ్రెస్‌ను వదిలి పెట్టడం అన్నం తినేవాళ్లు చేసే పని కాదని చెప్పానని వివరించారు.

పదవుల కోసం నాయకత్వం కోసం కొందరు కప్పగంతులు వేస్తున్నారని, దీన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన అన్నారు. తనతో పాటు మంత్రి పితాని సత్యనారాయణ, కరాటం రాంబాబు కూడా తమ పార్టీలోకి వస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.

తాను కాంగ్రెసు పార్టీని వీడేది లేదని పితాని సత్యనారాయణ ఇటీవల స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇప్పుడు వట్టి వసంతకుమార్ అదే పనిచేశారు. వట్టి వసంత కుమార్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు.

English summary
Minister Vatti Vasanth Kumar has denied the reports about his defection into YSR Congress party from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X