హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై అర్ధరాత్రి దాడి: నోయిడాలో అత్యాచారం,హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Attack on young girl in Hyderabad
హైదరాబాద్/ఢిల్లీ/చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం అర్ధరాత్రి ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో హనా అగర్వాల్ అనే యువతి తన స్నేహితుడు శ్రీధర్‌‍‌తో కలిసి కారులో వెళుతుండగా దుండగులు దాడి చేశారు. కారుపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీధర్ వారిని అడ్డుకున్నాడు. ఈ ఘటనలో శ్రీధర్ పైన కత్తులతో వారు దాడి చేశారు.

యువతికి కూడా గాయాలయ్యాయి. వారని కేరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల యువతులపై దాడుల ఘటనలు పెచ్చరిల్లాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఈ అర్ధరాత్రి దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. 21 ఏళ్ల యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. నోయిడాలోని ఓ కంపెనీలో పని చేసే యువతి శుక్రవారం ఆఫీస్‌కి వెళ్లినప్పటికీ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి సమీపంలో యువతి మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

English summary
A young girl was attacked by unknown persons on Saturday night at Banjara Hills Road Number 1 in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X