వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెబిసిలో రూ.5కోట్లు గెల్చుకున్న 37 ఏళ్ల హౌస్ వైఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mumbai woman wins Rs. 5 crore on Kaun Banega Crorepati
ముంబయి: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా క్రోర్‌పతి' షోలో ముంబయికి చెందిన ఓ గృహిణి రూ.5కోట్లు గెలుపొందింది. ముప్పయ్యేడేళ్ల సుర్మీత్ కౌర్ సాహెనీ అనే ఈ మహిళ ఈ షోలో రూ.5కోట్లు గెలుపొందిన రెండో వ్యక్తి. అంతకుముందు బీహార్ రాష్ట్రానికి చెందిన సుశీల్ కుమార్ అనే యువకుడు కెబిసి నాలుగో సిరీస్‌లో ఐదు కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ గృహిణి ఆరో సిరీస్‌లో దీనిని సొంతం చేసుకుంది.

ఉత్కంఠ భరిత క్షణాలు కొన్ని గడిచిన తర్వాత ఆప్‌కీ జవాబ్ సహీ హై అంటూ స్వయంగా లేచి వచ్చిన అమితాబ్ 'కౌర్ ' బన్‌గయీ కరోడ్‌పతిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి ఆరో సీజన్‌లో పంజాబీ మహిళ సన్‌మీత్‌ కౌర్ సాహెనీ అక్షరాలా ఐదు కోట్ల రూపాయల మెగా బహుమతిని గెలుచుకున్నారు. ఈ బంపర్‌ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

ముందుగా అమితాబ్, తరువాత తన భర్త వచ్చి చెప్పడంతో తనకే జాక్‌పాట్ వచ్చిందని నమ్మానని సాహినీ తెలిపారు. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది. తనకు బహుమతిగా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని పంజాబీ సంప్రదాయ కార్యక్రమాలకు దానం చేస్తానని, మిగిలిన మొత్తం ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామని సాహెనీ తెలిపారు.

పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టి.. కొన్నేళ్లుగా ముంబయిలో ఇళ్ల వద్ద ప్రైవేట్లు చెబుతున్న సాహినీ హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించే వ్యక్తిని వివాహమాడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కెబిసిలో తొలుత కోటి రూపాయలు మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. తర్వాత దాన్ని రెట్టింపు చేసినా, నాలుగో సీజన్ నుంచి మామూలు బహుమతిని కోటి రూపాయలుగానే ఉంచి.. ఐదు కోట్ల రూపాయల జాక్‌పాట్ అదనంగా చేర్చారు.

English summary
37 year old Surmeet Kaur Sawhney becomes the second contestant to win Rs. 5 crore on the latest season of the popular game show 'Kaun Banega Crorepati'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X