వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై షిండే చెప్పినట్లే: చాకో, సున్నితం: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ/ విజయనగరం: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన విషయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఇంకా 20 రోజుల వ్యవధి ఉందని ఆయన అన్నారు. ఇచ్చిన గడువులోగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారంనాడు అన్నారు. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం లేదని అన్నారు.

తెలంగాణ అంశంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆచితూచి మాట్లాడారు. ఇది సున్నితమైన అంశమన్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనల వేడి బొత్స సత్యనారాయణకు తగిలింది. ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేత నుంచి కూడా ఆయనకు ఆ అనుభవం ఎదురైంది. సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ - విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దీని ప్రభావం పార్టీపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్జీల పెంపుపై పునరాలోచించాలని కోరారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తానని అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.

విద్యుత్ సర్‌చార్జీల భారం సామాన్యులపై పడకుండా కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.

English summary
Aicc spokesperson Chako said that decission Telangana will be taken within the stipulated time. He said that his party is having 20 days time to take decission on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X