వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి రాజధానిగా అంగీకరించం: హరీష్, అంతు చూస్తాం: నాయని

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్/ సిద్ధిపేట: తెలంగాణను అడ్డుకునే శక్తులు బలహీనపడ్డాయని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత నాయని నర్సింహారెడ్డి అన్నారు. వారిని కేంద్రం ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం కేటీపీఎస్ పాల్వంచ శాఖ రూపొందించిన కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో జరిగింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

తెలంగాణపై కాంగ్రెస్ తనంతట తాను నెల రోజుల గడువు విధించుకుందని, దానిపై ఇప్పుడు కసరత్తు చేస్తోందని, కోర్ కమిటీ సమావేశాలంటూ వంటకాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నెల తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు జెండాలు ఇక్కడ ఉండవని ప్రజలు అల్టిమేటమ్ ఇవ్వటం వల్లనే కేంద్రంలో కదలిక వచ్చిందని నాయని అన్నారు. కాంగ్రెస్ విజ్ఞతతో వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ పార్టీకి అథోగతి పడుతుందని అభిప్రాయపడ్డారు.

ప్యాకేజీలు, కమిటీలు అంటున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని అని వివాదం పెడతారని అంటున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని అంటే సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వాళ్లు ఎట్లా వస్తారు? ఇక్కడి నుంచి ఎట్లా వెళ్తారు ? ఇక్కడ ఎట్లా ఉంటారో చూస్తామని అడిగారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలు ఇస్తేనే ఒప్పుకుంటామని, అది కాకుండా ఏ పేచీ పెట్టినా డబుల్ పేచీ పెడుతామని, అంతు చూస్తామని ఆయన అన్నారు.

హైదరాబాద్ తెలంగాణ ప్రజల కష్టార్జితమని, తెలంగాణ ప్రజల చెమటతో నిర్మాణమైందని, హైదరాబాద్‌ను పొత్తులో పెట్టి తెలంగాణ ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ పక్ష ఉపనేత హరీష్‌రావు చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో 1100ల రోజు తెలంగాణ సాధన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ఆయన మాట్లాడారు.ఐదేళ్ల పాటు పొత్తుల పెడ్తామన్నా ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో వాటా అడిగినా, ఆదాయంలో సొత్తు అంటే కుదురదని ఆయన అన్నారు. సీమాంధ్రలో కొత్త రాజధాని కట్టుకునే దాకా, అదీ మూడు నాలుగేళ్ల కంటే ఎక్కువ ఉండనివ్వమన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలన్నది సీమాంధ్ర ప్రజల కోరిక కాదని, కొద్ది మంది పెట్టుబడి దారులైన రాజకీయ నాయకుల డిమాండ్ అని విమర్శించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) leaders Nayani Narsimha Reddy and Harish Rao said that they will not agree for Hyderabad as combined capital for both the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X