వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి రోజూ ఎన్డీ తివారీ పితృత్వం కేసు విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ పితృత్వం కేసు విచారణను ప్రతి రోజూ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని కోర్టు చేసిన సూచనను తివారీ తిరస్కరించారు. దీంతో ఈ కేసు విచారణ రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని హైకోర్టు సోమవారం నిర్ణయించింది.

రోజువారీ ప్రాతిపదికపై విచారణ చేయాలని హైకోర్టు స్థానిక కమిషనర్‌ను ఆదేశించింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవడాన్ని తిరస్కరిస్తున్నట్లు తివారీ తరరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన సాక్ష్యం పూర్తిగా సరైందని చెప్పలేమని, అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా లేమని తివారీ తరఫు న్యాయవాది చెప్పారు.

రోహిత్ శేఖర్ బయోలాజకల్ ఫాదర్ తివారీ అని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది. అదే వైద్యపరమైన సాక్ష్యం మాత్రమేనని తివారీ తరఫు న్యాయవాది అన్నారు. దాంతో కేసును రోజువారీ ప్రాతిపదికపై విచారించడానికి హైకోర్టు విమలా మాకెన్‌ను స్థానిక కమిషనర్‌గా నియమించింది.

తివారీ పితృత్వం కేసు విచారణను స్థానిక కమిషనర్ జనవరి 21వ తేదీన ప్రారంభిస్తారు. తన బయోలాజికల్ ఫాదర్ తివారీ అంటూ రోహిత్ శేఖర్ అనే యువకుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తున్నారు.

English summary
A youth's paternity suit to declare N D Tiwari as his biological father was ordered to be heard on a day-to-day basis by the Delhi High Court today after the veteran Congress leader refused to settle the issue through mediation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X