వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే చివరి మాట: పేరు చెప్పిన గ్యాంగ్ రేప్ విక్టిం తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో మృతి చెందిన నిర్భయ అసలు పేరును ఆమె తండ్రి వెల్లడించారు. తన కూతురు పేరు అందరికీ తెలియాలని ఆయన అన్నారు. తనకు బతకాలని ఉందని తన కూతురు చెప్పిందని, అవే ఆమె చివరి మాటలు అని ఆవేదనతో ఆమె తండ్రి చెప్పారు. కాగా తన తల్లితో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఉండగా మొదట చెప్పిన మాట కూడా అదే. అమ్మా తనకు బతకాలని ఉందని ఆమె చెప్పింది. బ్రిటన్ పత్రికకు అతను వెల్లడించారు. తన కుమార్తె పేరు ప్రపంచానికి తెలియాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. బాధిత మహిళల్లో స్థైర్యం నింపేందుకు అది పనికి వస్తుందన్నారు.

నిర్బయ, అనామికగా భారత్ పిలుచుకుంటున్న గ్యాంగ్ రేప్ బాధితురాలి పేరును ఆమె తండ్రి చెప్పారు. ఆమె పేరు ప్రపంచానికి తెలియాలని, తన కూతురు ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఆమెను చూసి తాము గర్విస్తున్నామన్నారు. ఆమె నిజమైన పేరును బయటపెట్టడం ద్వారా అత్యాచార, లైంగిక దాడులు ఎదుర్కొన్న మహిళల్లో ధైర్యం పెరుగుతుందని ఆకాంక్షించారు.

53 ఏళ్ల ఆ తండ్రి బ్రిటన్‌కు చెందిన 'ది సండే పీపుల్' పత్రికకు వివరాలు అందించారు. ఆ పత్రిక ఆదివారం కథనం ప్రచురించింది. తండ్రిని ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామంలో ఇంటర్వ్యూ చేసినట్లు మిర్రర్ గ్రూప్‌కు చెందిన ఈ వార పత్రిక పేర్కొంది. డిసెంబర్ 16 రాత్రి దారుణ అత్యాచారం తర్వాత, 28న ఆమె మరణించాక కూడా భారత మీడియా పేరు, ఇతర వివరాల వెల్లడిపై సంయమనం పాటించింది. అలాగే ప్రస్తుతం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు దర్యాప్తు బహిరంగంగా జరుగుతున్నా ఆ వివరాలను బహిర్గతం చేయరాదని ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.

Delhi Horror: Sunday People reveals victim's name

ఈ నేపథ్యంలో బ్రిటీష్ పత్రిక ఈ ఇంటర్వ్యూను ప్రచురించటం విశేషం. ఆ దుర్మార్గులు ఆరుగురికీ మరణ శిక్ష విధించిందన్న వార్త వినాలన్నదే తమ కోరిక అని, ఇటువంటి ఘోర దురంతాలు ఇకపై జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ విమానాశ్రయంలో లోడర్‌గా పనిచేసే ఆయన, కుమార్తె విషాద జ్ఞాపకాలకు దూరంగా కుటుంబంతో స్వగ్రామం వెళ్లిపోయారు. డిసెంబర్ 16 నాటి దారుణం నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ... తాను మొదటిసారి ఆస్పత్రికి వెళ్లేసరికి తన బిడ్డ కళ్లు తెరవలేని నిస్సహాయ స్థితిలో మంచంమీద పడి ఉందని, తనను చూడగానే బాధ భరించలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందన్నారు.

అంతా చక్కబడుతుందని ధైర్యం చెప్పానని కానీ, అమ్మతోపాటు అన్నయ్యలు చూడ్డానికి రాగా మరోసారి బాగా ఏడ్చిందని, అటుపైన తమాయించుకుని, తమకే ధైర్యం చెప్పడం తనను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసిందన్నారు. ఆమె తప్పక కోలుకుంటుందని, దుండగులకు మరణశిక్ష పడక తప్పదని అనిపించిందన్నారు. కూతురుపై దాడి జరిగినప్పుడు ఆమె వెంట ఉన్న వ్యక్తి స్నేహితుడే తప్ప బాయ్ ఫ్రెండ్ కాదని చెప్పారు. ఆమెను కాపాడేందుకు అతడెంతో ధైర్యంగా ప్రయత్నించాడని ప్రశంసించారు. వారికి వివాహం నిశ్చయమైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

English summary
A British newspaper has revealed the name of the 23-year-old paramedical student who was sexually assaulted by six men in a moving bus in Delhi on Dec 16, 2012. The Sunday People talked to Jyoti Singh Pandey's grieving father at her native place, Ballia village in Uttar Pradesh, and published the interview today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X