వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహారీలే.. అలవాటు: గ్యాంగ్‌రేప్‌పై రాజ్‌థాకరేxలాలూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raj Thackeray-Lalu Prasad Yadav
ముంబై/పాట్నా: మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అత్యాచారం బీహారీ వలస వ్యక్తుల దుండగమేనని ఆయన అన్నారు. శనివారం రాత్రి గోరేగావ్‌లో జరిగిన గ్లోబల్ కొంకణ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్యాంగ్‌రేప్ గురించి అందరూ మాట్లాడుతున్నారని కానీ, ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడినుంచి వచ్చారని మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.

రేపిస్టులంతా బీహార్ నుంచి వచ్చినవారేనన్న వాస్తవం గురించి నోరెత్తేవారే లేరన్నారు. వారి వల్లే రేప్ కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. అసలీ వ్యవస్థే కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. బీహార్‌లో మాత్రమే చేసుకునే ఛాత్ పూజను ముంబయిలో నిర్వహించడం వారి సంఖ్యాబలాన్ని చూపేందుకు మాత్రమేనని విమర్శించారు. బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై ఇప్పటికీ చాలా కేసులు పెట్టారన్నారు. ఢిల్లీ ఘటన ఆవేదనకు గురి చేసిందన్నారు.

లాలూ ప్రసాద్ ధ్వజం

రాజ్ థాకరే వ్యాఖ్యలపై ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులంతా బీహారీలే అని రాజ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడ నేరం జరిగినా అందుకు బీహారీలే కారణమని ఆరోపించడం ఆయనకు, ఆయన పరివార పార్టీ శివసేనకు అలవాటయిపోయిందన్నారు. లాలూ ఆదివారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు.

తమ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని రాజ్ మానుకోవాలన్నారు. భార్యాభర్తలపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా లాలూ ఖండించారు. ఢిల్లీ యువతిపై అత్యాచారానికి వలస వచ్చిన బీహారీలే బాధ్యులంటే రాజ్ చేసిన వ్యాఖ్యలను రషీద్ అల్వీ ఖండించారు. మరోవైపు రాజ్ వ్యాఖ్యలపై ఆదివారం పాట్నాలో జెడియు ఎంపీ అలీ అన్వర్ అన్సారీ మండిపడ్డారు.

English summary
Maharashtra Navnirman Sena chief Raj Thackeray has blamed "Bihari" migrants for the recent case of gangrape of a girl in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X